హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gadwal న్యూడ్ వీడియోల కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

Gadwal న్యూడ్ వీడియోల కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

X
గద్వాల

గద్వాల న్యూడ్ వీడియోల కేసులో ట్విస్ట్

Gadwal: ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువకులు జిల్లాలోని వంద నుంచి 150 మంది వరకు మహిళల ఫోటోలను నగ్న చిత్రాలను సేకరించారు. అశ్లీల వీడియోలను రికార్డ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gadwal | Mahbubnagar | Andhra Pradesh

Naveen Kumar, News18, Nagarkurnool

అశ్లీల చిత్రాలతో మహిళలను వేధిస్తున్న యువనాయకులు అరెస్ట్ చేసిన ఘటన గద్వాల్లో జరిగింది. రాజకీయ నాయకుల అండదండలతో కొందరు యువ నాయకులు తమ ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారు. మహిళలను లోబరుచుకొని వారిని నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా శారీరకంగా చిత్రహింసల గురి చేస్తున్నారు. ఈ ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువకులు జిల్లాలోని వంద నుంచి 150 మంది వరకు మహిళల ఫోటోలను నగ్న చిత్రాలను సేకరించారు. అశ్లీల వీడియోలను రికార్డ్ చేశారు. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురు నాయకుల మధ్య వివాదం చెలరేగడంతో ఒకరికి సంబంధించిన మహిళల ఫోటోలు మరొకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త బయటకు వచ్చింది.

ఈ అంశంపై తిరుమలేష్ అలియాస్ మహేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి చేపట్టారు. నిఖిల్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నటుగా గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గద్వాల జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు చేసిన సిగ్గుమాలిన పని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురు నాయకులు గద్వాలలోని కొందరి అమాయకమైన మహిళల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని వారిని లోబరుచుకొని అశ్లీల చిత్రాలు రికార్డ్ చేశారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. తిరుమలేష్ అనే యువకుడిని జిల్లాలోని వేకంపేట దగ్గర అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో 100 మంది నుంచి 150 మంది మహిళల ఫోటోలు వివరాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది చదవండి: ఆమెకు 25.. అతడికి 52.. ఇద్దరికీ ఫేస్ బుక్ స్నేహం.. కలిసి కాపురం.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్

అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పూర్తి వివరాలు పోలీసులు తమదైన విచారణ చేసి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ముగ్గురు యువ నాయకులు ఒకే గ్యాంగ్ గా ఉంటూ లోపర్చుకున్న మహిళల ఫోటోలు వీడియోలను ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ ముగ్గురు కూడా సదరు మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి కోరికలు తీర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువు మహిళ అశ్లీల ఫోటో కనిపించింది. దీంతో ముగ్గురి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.

ఇది చదవండి: ఆపన్నహస్తం కోసం అభాగ్యురాలి ఎదురుచూపు, ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకోరూ..!

ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం ఘర్షణలు చోటుచేసుకుంది. రెచ్చిపోయిన నాయకుల తమ వద్దనున్న మహిళల అశ్లీల ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి చూడడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ వీడియోలో వైరల్ కావడంతో సదరు యువ నాయకులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.ఈ అంశంపై ఓ ప్రధాన నేత యువ నాయకుడికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఘటన పై గద్వాల జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ స్పందిస్తూ ఈ వ్యవహారం చాలా సున్నితమైన అంశమని, పూర్తిగా విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. బాధితులు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు.

First published:

Tags: Jogulamba gadwal, Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు