హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ మాట చెప్తేనే హడలిపోతున్న జనం.. ఆస్పత్రులన్నీ హౌస్ ఫుల్.. కారణం ఇదే..!

ఆ మాట చెప్తేనే హడలిపోతున్న జనం.. ఆస్పత్రులన్నీ హౌస్ ఫుల్.. కారణం ఇదే..!

నాగర్ కర్నూల్ జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ (Telangana) ను రికార్డుస్థాయిలో వర్షాలు ముంచెత్తాయి. దీంతో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) విజృంభిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  N.Naveenkumar, News 18, Nagarkurnool

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ (Telangana) ను రికార్డుస్థాయిలో వర్షాలు ముంచెత్తాయి. దీంతో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) విజృంభిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అన్ని ఆసుపత్రులలో సాధారణ స్థాయికి మించి ఓపిలు నమోదు అవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య లోపం వల్ల దోమలు బెడద ఎక్కువ కావడంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాన కాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఉండగా.., జిల్లాలో మాత్రం నామమాత్రంగా వ్యవహరిస్తూరనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు జ్వర రపిడుతులుగా మారి మంచం పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆసుపత్రులకు సీజనల్ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరగడంతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నా కానీ వైద్యాధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వడం లేదు.

  పది రోజులుగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి నిత్యం 600 పైగా ఓపి పేషేంట్ లు వస్తున్నారు. అయితే వీరిలో జ్వరం వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఈ సారి వానకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 14 డెంగి కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొల్లాపూర్ తిమ్మాజిపేట, తాడూరు, పెద్దకొత్తపల్లి, మున్ననూరు, కల్వకుర్తి, పెంటలవెల్లి, దోమల పెంట పీహెచ్ సీలకు జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది.

  ఇది చదవండి: అల్లరి చేస్తున్నారేంటని అడిగినందుకే అమానుషం..!


  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఔట్ పేషెంట్ల వస్తున్నారు. వందల సంఖ్యలో డెంగ్యూ, మలేరియా కేసులు బయటపడుతున్నాయి. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ మలేరియా కేసులు అధికారుల లెక్కల్లో ఉండడం లేదు. నిత్యం ఒకటి రెండు చొప్పున కొత్తగా డెంగ్యూ మలేరియా కేసులు నమోదవుతున్నా అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొస్తున్నారు.

  ఇది చదవండి: ప్రపంచంలో మరెక్కడా లేదు.. మన నెల్లూరులో మాత్రమే అది సాధ్యమైంది…! ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసా..?


  జిల్లాలో ఎలాంటి డెంగ్యూ, మలేరియా కేసులు లేవని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్టకు చెందిన చిన్న సంజయ్… వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పెంట్లవెల్లి ఆసుపత్రికి వెళ్లగా అతనికి మలేరియా జ్వరం ఉందని మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉండగా మరోవైపు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు మలేరియా కేసులు నమోదు కాలేదని చెబుతున్నారు.

  ఇది చదవండి: తెలంగాణ రాబిన్​హుడ్​ "పండగ సాయన్న": ఆయన చరిత్ర ఇదే..


  జిల్లాలోని పదర మండలం చెన్నంపల్లికి చెందిన చంప్లీ అనే మహిళ… నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. స్థానికంగా ఉండే ఆర్ఎంపితో చికిత్సకు తీసుకున్నాక కూడా తగకపోవడంతో మున్ననూరులోని ఆసుపత్రిలో చేరింది. గ్రామంలో దోమల ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారుల ఎలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: దేవుడు లేని గుడి.. అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?


  గిరిజన ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీకి చేయాలని కోరుతున్నారు. జిల్లాలోని సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు చేపట్టాల్సిన నియంత్రణ చర్యలు కరువయ్యాయని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని చంచు పెంటల్లో గిరిజన తండాలు మారుమూల పల్లెలో విస్తృతంగా మెడికల్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

  ఇది చదవండి: రెండు కిలోమీటర్ల వంతెన.. 300 కిలోమీటర్లతో సమానం.. ఎక్కడో మీరే చూసేయండి  గతంలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఇలాంటి కార్యక్రమాలు కరువయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని దొంతెరలను పంపిణీ చేయాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు