Naveen Kumar, News18, Nagarkurnool
విద్యార్థుల్లో దాగినటువంటి నైపుణ్యాలను ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థుల్లో ఎలాంటి ప్రతిభవుంది ఎలాంటి నైపుణ్యం ఉంది అనే అంశాలను గుర్తించి వాటిలో వారిని ప్రోత్సహించేందుకు కళా ఉత్సవ్పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా స్థాయిలో నుండి పోటీలను నిర్వహించి విద్యార్థుల నుంచి ప్రతిభను వెతికి తీసేలా ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులకు ఒక సర్కులర్ జారీ చేశారు.
విద్యార్థుల్లో ఎలాంటి టాలెంట్ ఉన్న ఎలాంటి కళా నైపుణ్యం ఉన్న వాటిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించి ఆ పాఠశాల అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఎలాంటి టాలెంట్ ఉంది గుర్తించి వాటిలో వారికి కావలసినటువంటి శిక్షణను అందించి ఈ పోటీల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఈ పోటీలను నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హైస్కూల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు పలు నృత్య కళారూపాలను ఆటలను అదేవిధంగా సంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లోతొలి రోజు పోటీల్లో శాస్త్రీయ, సంప్రదాయ, జానపద పాటల పోటీలు, శాస్త్రీయ, జానపద, నృత్య, వాయిద్య, సంగీత పోటీలు ఉత్సాహంగా జరిగాయి.జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపికైన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు., రెండవ రోజు సాంప్రదాయ బొమ్మల తయారీ పోటీలు, చిత్రలేఖనం, సోలో డ్రామా పోటీలు నిర్వహించారు. .రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రకటించి వారికి బహుమతులను ప్రధానం చేస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల చెందిన 12 మంది విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
Warangal: మరమ్మతుల పేరుతో రోడ్ల మూసివేత.. పైన పటారం లోన లొటారంగా ఓరుగల్లు
వీరు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. డ్యాన్స్ కార్యక్రమాల్లో పాటల పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈ పాఠశాలను న్యూ 18 సైకిల్ విసిట్ చేసి విద్యార్థులు ఏ విధంగా పోటీలకు సన్నద్ధమయ్యారు అనే అంశాలను తెలుసుకున్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులను సాంస్కృతి కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉంచేందుకు తాము ఎప్పుడు కృషి చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 మంది విద్యార్థులకు శిక్షణ నుంచి వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కళాశాలలోని ఉపాధ్యాయుల ప్రోత్సాహం కారణంగానే తాము పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందని విద్యార్థులు చెప్పుకొచ్చారు.
ఈ పాఠశాల రెసిడెన్షియల్ కావడంతో విద్యార్థులు అనునిత్యం ఉపాధ్యాయుల చెంతనే ఉంటారు. దీంతో వారి అభిరుచులను వారి టాలెంట్లను గుర్తించే అవకాశం తమకు దక్కిందని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana