హోమ్ /వార్తలు /తెలంగాణ /

Swine flu: ఆ జిల్లాలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం: ఆరేళ్ల చిన్నారికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ 

Swine flu: ఆ జిల్లాలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం: ఆరేళ్ల చిన్నారికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ 

సైన్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమం (ఫైల్)

సైన్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమం (ఫైల్)

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలో ఇటీవల రెండు కేసులు నమోదు కావడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఆరేళ్ల చిన్నారితో పాటు 39 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలో స్వైన్ ఫ్లూ (Swine flu) కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలో ఇటీవల రెండు కేసులు (Two cases) నమోదు కావడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఆరేళ్ల చిన్నారితో పాటు 39 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ జ్వరం, ఇతర లక్షణాలతో ఈ ఇద్దరు చేరారు. కానీ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారిని హైదరాబాద్ (Hyderabad) పంపించారు. అక్కడ కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. హైదరాబాద్ లో చికిత్స అనంతరం జిల్లా కేంద్రానికి వచ్చినట్లు సమాచారం.

  అయితే ఈ విషయంపై జనరల్ ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ తమ వద్దకు ఎలాంటి కేసులు రాలేదని చెప్పుకొచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఆరేళ్ల పాపకు (Girl) స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిందని ఇదివరకే వారు హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారని చెప్పగా, మరో వ్యక్తికి స్వైన్ వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని అంటున్నారు. స్వైన్ ఫ్లూ పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  పాము కాటుతో మహిళ మృతి: జోగులంబ గద్వాల జిల్లా శాంతినగర్‌కు చెందిన నాయికి సరస్వతి (35) గురువారం పాము కాటుతో మృతి చెందింది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు మేరకు జూలకల్ గ్రామానికి చెందిన సరస్వతి గురువారం పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పాము కాటుతో సరస్వతి మృతి చెందింది.

  Rajanna Sircilla: ఆ గ్రామ సర్పంచ్​ భర్త చేసిన ఓ తప్పుకు.. ఊరంతా ఒకరోజు చీకట్లో బతకాల్సి వచ్చింది.. ఏం జరిగిందంటే?

  పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య:

  వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రేముద్దుల గ్రామానికి చెందిన రాజు (28)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా అనారోగ్యంతో భార్య గతంలో మృతి చెందింది. దీంతో రాజు మరో పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకడం లేదు. దీంతో మనస్థాపానికి గురైన రాజు గురువారం ఏదుట్ల గ్రామ శివారులో ఓ రైతు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Nagarkurnool

  ఉత్తమ కథలు