హోమ్ /వార్తలు /telangana /

Nagarkurnool: ఏంటమ్మా మహిళలంటే అంత చులకనా? ఆడపిల్ల పుడుతుందేమోనని అంత పని చేస్తావా?

Nagarkurnool: ఏంటమ్మా మహిళలంటే అంత చులకనా? ఆడపిల్ల పుడుతుందేమోనని అంత పని చేస్తావా?

గర్భిణీ ఆత్మహత్య

గర్భిణీ ఆత్మహత్య

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె మళ్లీ గర్భం దాల్చింది. నెలల నిండుతున్న కొద్ది మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే ఆందోళనకు గురైంది. అదే భయంతో కఠిన నిర్ణయం తీసుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె మళ్లీ గర్భం (Pregnant) దాల్చింది. నెలల నిండుతున్న కొద్ది మళ్లీ ఆడపిల్ల (Baby girl) పుడుతుందనే ఆందోళనకురై ఆ నిండు గర్భిణీ ఉరివేసుకొని ఆత్మహత్య  (Suicide)చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ (Mahbubnagar) మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గాజులపేటకు చెందిన మౌనిక (25)కు అదే గ్రామానికి చెందిన మాధవరెడ్డితో వివాహం అయింది. మౌనికకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ గర్బంధాల్చడంతో ఏడునెల గర్భినిగా మౌనిక చికిత్స తీసుకుంటుంది. అయితే మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయాందోళనతో మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే మౌనిక మృతిపై ఎటువంటి అనుమానం లేదని తల్లిదండ్రులు చెప్పినట్టు తెలిసింది.

  భార్య, కూతురు హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య: పశ్చాత్తాపము, అనారోగ్య సమస్యతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం కట్టుకున్న భార్యను, కన్న కూతురిని హత్య చేసిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మహబూబ్ నగర్ మండలం జైనల్లీపూర్ కు చెందిన దయ్యాల కృష్ణయ్య (48) మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది మే 8న తన కూతురు క్రిస్టియన్ పల్లి చెందిన యువకునికి పెళ్లి చేశారు. కూతురు తనకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు.

  ఈక్రమంలో మే 25న పుట్టింటికి వచ్చిన ఆమె ఇక అత్తారింటికి వెళ్ళనంటూ భీష్మించుకు కూర్చుంది. తల్లి కూడా కూతురికి మద్దతు పోవడంతో ఇంట్లో గొడవలు పెరిగాయి. నచ్చజెప్పినా వినకపోవడంతో మే 31న అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య, కూతురు తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగాడు కృష్ణయ్య. చికిత్స అనంతరం కోలుకున్న దయ్యాల కృష్ణయ్యను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 3 నెలల పాటు జైల్లో ఉన్న కృష్ణయ్య బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ముభావంతో ఉండేవాడు.

  ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి కనిపించకపోవడంతో కొడుకు బాలరాజు తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్ళగా సమీపంలోని పొలంలో చింత చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి జేబులో ఒక సూసైడ్ ఉండగా అందులో తాను కడుపునొప్పి భరించలేక ఉరివేసుకొని చనిపోతున్నాని, తన చావుకు ఎవరు కారణం కాదని రాసి ఉంది.

  అయితే గ్రామస్తులు మాత్రం తల్లి కూతుర్ని హత్య చేశాడన్న బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెప్తున్నారు. ఏడేళ్ల క్రితం కృష్ణయ్యకు కడుపు నొప్పి ఆపరేషన్ జరిగింది. దాని తాలూకు నొప్పి వస్తుందనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొడుకు చెబుతున్నాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Nagarkurnool, Pregnant women, Suicide

  ఉత్తమ కథలు