Naveen Kumar, News18, Nagarkurnool
మూడు సంవత్సరాల తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా వాయిదా పడినటువంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సకల ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 450 మంది విద్యార్థులు వివిధ ప్రతిభలను ప్రదర్శించేలా ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి విద్యార్థుల్లో కూడా వారికి ఉన్నటువంటి ప్రతిభను వెతికి తీసేలా నైపుణ్యాలను గుర్తించే విధంగా నూతన ఆవిష్కరణను చేసే విధంగా ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోబో టీచర్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల కొరత ఏర్పడితే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఈ రోగాలు ఉపయోగపడతాయని వారు చెప్పుకొచ్చారు. ఈ రోబోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, పాఠాలను బోధిస్తారు. చిప్ ద్వారా పాఠాలను అప్లోడ్ చేసి నిర్మాణం చేపట్టారు.
ఈ రోబో ఎలాంటి ప్రశ్నలు అడిగినా కానీ వెంటనే సమాధానం ఇచ్చేలా తయారు చేశామని వివరించారు. తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వలన ఈ రోబోట్ ను తయారు చేయగలిగామని విద్యార్థులు చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana