హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Politics: పాలమూరు కాంగ్రెస్‌లో ముసలం.. పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు.. కారణం ఇదే..!

TS Politics: పాలమూరు కాంగ్రెస్‌లో ముసలం.. పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు.. కారణం ఇదే..!

పాలమూరు కాంగ్రెస్ లో ముసలం

పాలమూరు కాంగ్రెస్ లో ముసలం

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress) లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ వర్గపోరు తారాస్థాయి చేరతోంది. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నాయకుల చేరికలపై ఆ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..హై కమాండ్‌కు లేఖలు రాస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  Naveen Kumar, News18, Nagarkurnool


  తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress) లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ వర్గపోరు తారాస్థాయి చేరతోంది. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నాయకుల చేరికలపై ఆ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..హై కమాండ్‌కు లేఖలు రాస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తమకు చెప్పకుండానే టీడీపీ (TDP) వారిని పార్టీలోకి తీసుకొస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తూ పార్టీని వీడుతున్నారు. ఈనేపథ్యంలోనే పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న అనిరుథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.


  ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేది లేదని, శేఖర్‌తో కలిసి వేదికను పంచుకోలేమని జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనిరుద్ రెడ్డి లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం, దీటుగా ఆయన స్పందించడం, ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమతి సెగలు రాసుకోవడం వంటి తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుద్ రెడ్డి రాష్ట్ర అధిష్టానానికి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.


  ఇది చదవండి: పసిపిల్లలకు బారసాల చూశాం.. లేగ దూడకు బారసాల చూశారా..?


  ఏడాది నుంచి అనిశ్చితి: మాజీ ఎమ్మెల్యే మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు తలెత్తాయి. నేరచరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖలు రాయడం దుమారం చెలరేగింది.


  ఇది చదవండి: విధికి ఎదురీదుతున్న యువతి.. ఆమె పట్టుదలకు మనో ధైర్యానికి విధి కూడా సలాం కొట్టాల్సిందే..!


  ఇక రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత అక్టోబర్ 12న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అనంతర కాలంలో శేఖర్ పై ఉన్న కేసులను కోర్టు కొట్టి వేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమైంది. హైదరాబాద్ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి తదితర నేతల సమక్షంలో శేఖర్ హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుద్ రెడ్డి ఇటు ఎర్ర శేఖర్ వేరువేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఈడీ కేసుల విషయంలోనూ ఇటీవల సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వడం పై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు.


  ఇది చదవండి: రాజన్న ధర్మగుండానికి మోక్షం ఎప్పుడు?: సహనం కోల్పోతున్న భక్తులు


  ఈ క్రమంలో జడ్చర్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టినప్పటికీ... ఎర్ర శేఖర్ వర్గం... అనిరుద్ రెడ్డి వర్గం ఎడమొహం పెడమొహంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీలో జరుగుతున్న విషయాలపై అధిష్టానానికి అనిరుద్ రెడ్డి లేఖ రాశారు.


  ఇది చదవండి: ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యేదెన్నడు..? పేదలకు దక్కేదెన్నడు..?


  టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణ: కాంగ్రెస్ పార్టీకి ఎవరు అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని, కాంగ్రెస్ అభివృద్ధికి పనిచేయడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్ర శేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారంటూ అనిరుద్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చిన వారితో పార్టీకి పెద్దగా ప్రభావం లేకున్నా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అనిరుద్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీత దయాకర్ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను స్థానికంగా ఉండే వ్యక్తినని పార్టీలో తన ప్రాధాన్యతను పక్కనబెట్టి, టికెట్టు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాటలోనే అనిరుద్ రెడ్డి నడుస్తారా అని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. కాగా అనిరుద్ రెడ్డి లేఖపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మంగళా రవి, ఎంపీటీసీ సంఘం నాయకులు రామచంద్రయ్య తదితరులు నవపేటలో విలేకరుల సమావేశం నిర్వహించి అనిరుద్ రెడ్డి తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోలేక ఇలా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదురుతాయా అనే సందేహం కార్యకర్తల్లో కలుగుతుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mahabubnagar, Telangana, TS Congress

  ఉత్తమ కథలు