హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నల్లమలలో ఆంక్షలు.. ఎందుకంటే?

Telangana: నల్లమలలో ఆంక్షలు.. ఎందుకంటే?

అప్రమత్తమైన అధికారులు

అప్రమత్తమైన అధికారులు

Telangana: నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్తున్నారా.. అయితే ముందుగా అటవీశాఖ ఆంక్షలు గురించి అవగాహన ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నుంచి శ్రీశైలం వరకు ప్రధాన రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అటవీ శాఖ అధికారులు వివిధ ఆంక్షలకు విధించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్తున్నారా.. అయితే ముందుగా అటవీశాఖ ఆంక్షలు గురించి అవగాహన ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నుంచి శ్రీశైలం వరకు ప్రధాన రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అటవీ శాఖ అధికారులు వివిధ ఆంక్షలకు విధించారు. అటవీ ప్రాంతంలో నిబంధనలు అతిక్రమిస్తేభారీ జరిమానాలు విధిస్తున్నది.ఇప్పటికే పర్యావరణ నిర్వహణ ఎన్ఎంసి పేరిట నల్లమలలో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు.

అడవి మార్గంలో అకారణంగా వాహనాల నిలిపినా చెత్తా, ప్లాస్టిక్ వేసినా నల్లమల అభయారణ్యంలో మద్యపానం, ధూమపానం చేసినా జరిమానా తప్పదు. నల్లమల దారిలో కోతులకు ఆహారం వేసినా తమ వాహనాలలో 30 కిలోల మీటర్లకు మించి వేగంగా నడిపించినా జరిమానా తప్పదు. అటవీశాఖ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అటవీ సంరక్షణపై ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ఫారెస్ట్ లో 2,611 చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

జిల్లాలో అమ్రాబాద్, అచ్చంపేట మండలాలతో పాటు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డివిజన్లో మూడు అటవీ డివిజన్లో అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ ఉంది. తూర్పు ప్రాంతంలో నల్లమల కొండల్లో ప్రసిద్ధి చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ దట్టమైన కోర్ ఏరియా పరంగా రాష్ట్రంలోనే రెండోవదిగా ఉంది. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లో కోర్ ఏరియాలోచెత్తా, ప్లాస్టిక్ వేసినా మద్యపానం, ధూమపానం చేసిన 10వేలనుంచి 50 వేల వరకు జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కోతులకు ఆహారం వేస్తే పది వేలు నుంచి 30 వేల వరకు జరిమానా, అకారణంగా వాహనాలు నిలిపినా, గంటకు 30 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా కోర్ ఏరియాలో వాహనాలు నడిపితే పదివేల నుంచి 40 వేల వరకు 50,000 వరకు అధికారులు జరిమానాలను వివరించనున్నారు.

టైగర్ రిజర్ ఫారెస్ట్ లో నిత్యం పెద్దపులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు శ్రీశైలం ప్రధాన రహదారిపై సంచరిస్తూ ఉంటాయి. పర్యాటకులు తమ సెల్ఫోన్లో చిత్రాలను బంధిస్తూ అది దగ్గరగా పెద్దపులను వీక్షించేందుకు వెళ్లేందుకు ప్రత్నిస్తారు. నల్లమల కోర్ ఏరియాలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కరు రోడ్డుపై సంచరించడం చాలా ప్రమాదమనిగుంపులు గుంపులుగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని పెద్దపులలు ఎక్కువ సంఖ్యలో అమ్రాబాద్టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సంచరిస్తున్నాయనిఅటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ కోసమే నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు.నిబంధనల గురించి ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పిస్తామని వివరించారు. టైగర్ రిజర్ ఫారెస్ట్ లో కోర్ ఏరియాతో పాటు బఫర్ జోన్ లోఅటవీశాఖ నిబంధనలు యధాతతంగా అమలు అవుతాయని అధికారులు తెలిపారు.అటవీశాఖ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే 1000 రూపాయల నుంచి పదివేల వరకు జరిమానా విధిస్తారని కోర్ ఏరియాలో మాత్రమే జరిమానా రుసుము అధికంగా ఉండటం వల్ల అటవీ చట్టం 1947, 1972 లను అటవీశాఖ అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు.

అటవీసంరక్షణలో భాగంగానే పర్యావరణ నిర్వహణ పేరిట జరిమానా వేస్తున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు. ఈ జరిమాన డబ్బును నల్లమల ప్రాంతం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని శ్రీశైలం రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులకు వేసే చెత్తను ప్లాస్టిక్ సేకరించేందుకు నిధులు వెచ్చిస్తామని తెలిపారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు