హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది..? ఆ నేతపై తిరుగుబాటు ఎందుకు..?

ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది..? ఆ నేతపై తిరుగుబాటు ఎందుకు..?

వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ పై తిరుగుబాటు

వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ పై తిరుగుబాటు

జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్, కొందరు ఎంపీపీలు ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో తాజాగా వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా తిరుగుబాటుబావుట ఎగురవేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

వనపర్తి జిల్లా (Vanaparthy District) కేంద్రంలోని మున్సిపాలిటీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. వనపర్తి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో మంత్రి వర్సెస్ అసంతృప్తి నేతలుగా రాజకీయం రగులుతుంది. ఆ జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్, కొందరు ఎంపీపీలు ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో తాజాగా వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా తిరుగుబాటుబావుట ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్గా గట్టు యాదవ్, వైస్ చైర్మన్గా శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే వీరిద్దరిపై మున్సిపాలిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

2020లో మున్సిపల్ ఎన్నికల్లో 33 వార్డులకు గాను 25 వార్డులలో గులాబీ నేతలు గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లను తమ వార్డ్ లోకి అత్యధికంగా నిధులు మళ్లించుకొని అభివృద్ధి పనులు చేసుకోవడం మిగిలిన కౌన్సిలర్లకు అరకరా నిధులు మంజూరు చేయడంతో అసంతృప్తులు మొదలయ్యాయి. ఇటీవల మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వార్డుకు ఎస్సీ, ఎస్టీ నిధులు రెండు కోట్ల 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేయడం.. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం గులాబీ నేతల రియల్ ఎస్టేట్ వెంచర్లకు సమీపంలో స్థలం కేటాయించడం వివాదం మొదలైంది. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వార్డుకు ఏకాపక్షంగా అధిక నిధులు కేటాయించడంతో తమకు ఏమాత్రం లబ్ధి చేకూరచడం లేదని అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఊరికి దూరంగా ఉన్న వైస్ చైర్మన్ వెంచర్ సమీపంలో స్థలం కేటాయించడంతో భరించలేని అధికార పార్టీ కౌన్సిలర్లు అప్పట్లో తిరుగుబాటు చేశారు. వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు.

ఇది చదవండి: కొత్త సాగువైపు రైతుల చూపు.. లాభాల ఎలా ఉన్నాయంటే..!

కాగా మంత్రి నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు. అయితే రెండు రోజుల క్రితం సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణ పనులు మొదలవుతున్నాయని పనులను అడ్డుకోవాలని వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు హల్చల్ చేయడంతో తిరిగి ఆంశంపై వివాదం చెలరేగింది. వైస్ చైర్మన్ తో పాటు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పై సైతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇటు అధికార అటు ప్రతిపక్ష కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. దీని గురించి ప్రత్యేకంగా అధికార పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ , బిజెపి, టిడిపిపార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒకచోట సమావేశమై సీక్రెట్ గా చర్చించుకున్నారని తెలిసింది.

ఈ దఫా మంత్రి జోక్యం చేసుకున్నా, ఎటువంటి ఒత్తిడి తెచ్చినా భయపడనవసరం లేదని, అవసరమైతే పార్టీకి రాజీనామా చేయడానికి సైతం అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడినట్టు సమాచారం. అయితే దీనంతటికీ కారణం కొందరు అధికార పక్ష పార్టీ కౌన్సిలర్లని తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమకు ఎలాగో టికెట్ తగ్గదని తెలిసి అధికారంలో ఉన్న ఈ సమయంలోనే పనులు చేయించుకోవాలనే ఆలోచనలతో ఈ విధంగా కలిసి తీర్మానానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డికి సైతం పూర్తి వివరాలు అందినట్టు, ఆయన సీరియస్ గా ఈ విషయంపై పరిశీలిస్తున్నట్టు సమాచారం.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు