హోమ్ /వార్తలు /తెలంగాణ /

బీఆర్‌ఎస్‌లో రెబల్స్ బెడద.. ఆత్మీయ సమ్మేళనాల్లో అసంతృప్తులు!..

బీఆర్‌ఎస్‌లో రెబల్స్ బెడద.. ఆత్మీయ సమ్మేళనాల్లో అసంతృప్తులు!..

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో రెబెల్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలను చేపట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(N.Naveen Kumar, News18,Nagarkurnool)

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో రెబెల్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలను చేపట్టారు. ప్రధాన్యంగా గద్వాల, వనపర్తి , దేవరకద్ర, వంటి నియోజకవర్గం కార్యకర్తల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుంది. అచ్చంపేట నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఫ్లెక్సీలను నెలకొల్పుతున్నారు.

ఎన్నికల ముందు ఇలాంటి గొడవలు చేయడం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అధిష్టానం పిలుపుమేరకు ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమ్మేళనలో అసంతృప్తి నేతలు అందరిని కలుపుకు పోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ గ్రూప్ రాజకీయాలు బగ్గుమంటున్నాయి.

ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తూ ముఖ్య నాయకులకు సమాచార అందించకపోవడం, ఇతర వర్గాల చెందిన నాయకులతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడంతో ఆత్మీయ సమ్మేళనాల్లో విభేదాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి.

నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న అంతరాలను తొలగించి అందరూ కలిసికట్టుగా వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల సారధ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలునేతలు మధ్య మరింత విభేదాలను సృష్టించేలా మారుతున్నాయి. అందరి మధ్య సఖ్యతను కుదిరించేందుకు పార్టీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల ఇన్చార్జిలకు నియమించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆత్మీయ సమ్మేళనంలో నేతల మధ్య విభేదాలు సృష్టించేలా సాగుతున్నాయి. కార్యకర్తలు ఆరంభానికి ముందేజిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా మండలాల జడ్పిటిసిలు, ఎంపీపీలు తదితర ముఖ్య నాయకులతో కలిసి కార్యక్రమాల నిర్వహణ సంబంధించి జిల్లా ఇన్చార్జులు తగిన సలహాలు సూచనలను చేయాల్సి ఉంటుంది.

మంత్రులు, ఎమ్మెల్యేల సారధ్యంలో కార్యక్రమాలు జరగాలని, కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టే మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు హాజరు కావలసిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్ లు కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది.కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో గత నాలుగు ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు అయోమయానికి గురిచేస్తున్నాయి.

జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలలో విభిన్న పరిస్థితులు ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య హాజరు కావడం లేదు. తమకు ఆహ్వానం లేకపోవడం వల్లే పార్టీ కార్యక్రమాలకు వెళ్లడం లేదని సహచర పార్టీ నేతలతో చెపినట్టు సమాచారం.

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మధ్య గత కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. పలు సందర్భాలలో పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆలోచనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఉన్నారని ప్రచారం జరగడంతో నేతల మధ్య విభేదాలకు దారితీసింది.

అలంపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలకు ఎమ్మెల్యే అబ్రహం ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఆయా మండలాల స్థానిక ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఆ కార్యక్రమాలను ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు డుమ్మా కొడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఇన్చార్జి చర్యలు తీసుకోవాలని సమస్యలు పరిష్కరిస్తేనే తాము కార్యక్రమాలకు హాజరవుతామన్నట్టుగా ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటున్నట్లుగా సమాచారం.

అయినప్పటికీ ఎమ్మెల్యే కార్యక్రమాలను నిర్వహిస్తూనే ముందుకు సాగుతూ వస్తున్నారు. కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతుండడంతో ఎమ్మెల్యే అబ్రహం ఉత్సాహంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు