హోమ్ /వార్తలు /తెలంగాణ /

NagarKurnool: వెంచర్‌లో ఫ్లాట్లు అన్నారు.. కోట్ల విలువ చేస్తుందన్నారు..! చివరకు కుచ్చుటోపీ పెట్టారు..!

NagarKurnool: వెంచర్‌లో ఫ్లాట్లు అన్నారు.. కోట్ల విలువ చేస్తుందన్నారు..! చివరకు కుచ్చుటోపీ పెట్టారు..!

ప్లాట్ల పేరుతో కుచ్చుటోపీ..!

ప్లాట్ల పేరుతో కుచ్చుటోపీ..!

ప్రముఖ కంపెనీలకు చెందిన వెంచర్‌లలో తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని చెప్పి జనాలను నమ్మించారు. భూమిని కూడా చూపించారు. దీంతో గ్రామస్తులు నిజమేనని నమ్మి డబ్బులు కట్టారు. ఇంకేముంది కోటి రూపాయలతో ఊడాయించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  N.Naveen kumar, News 18, Nagarkurnool


  Nagarkurnool; పేద, మధ్య తరగతి వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితం మొత్తం కూడబెట్టిన డబ్బులతో వెంచర్‌లలో ప్లాట్లు కొంటుంటారు. భూమిపై పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు పొందవచ్చని డబ్బులు వెచ్చిస్తారు. దీనిని ఆసరాగా తీసుకొని కొందరు మోసగాల్లు అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వెంచర్‌లలో తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని మోసం చేసి పరారు అవుతున్నారు. ఇలాంటి సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్ మండలం ఈదమ్మ తండాలో జరిగింది. గ్రామస్తులను నమ్మించి రూ.కోటి వరకు వసూలు చేసి పరారయ్యారు. ప్రముఖ వెంచర్ పేరు చెప్పి ఇళ్ల స్థలాలను అమ్ముతున్నట్లు నమ్మించి రూ. కోటి వరకు దండుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు బాలనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.


  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన శంకర్, మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలానికి చెందిన రవి నాయక్‌లు ఇద్దరు దగ్గర బంధువులు.  వీళ్లిద్దరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని ప్రముఖ వెంచర్‌లో మార్కెటింగ్ ఏజెంట్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. కిస్తుల పద్ధతిలో వెంచర్లను అమ్మిస్తూ ఉంటారు.


  Read this also; Rajanna siricilla: సిరిసిల్లలో సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సీన్‌ రిపీట్‌..! ఏంటో మీరే చూడండి..!


  ఇలా ఈదమ్మగడ్డ గ్రామంలో ఒకరిద్దరికి వెంచర్‌లో ఇళ్ల స్థలాలను ఇప్పించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సొంత కార్యాలయం ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. కస్టమర్‌లు రాకపోవడంతో వ్యాపారం దివాలా తీసింది. ఈ క్రమంలో డబ్బులు సంపాదించేందుకు యాదాద్రిలోని ఓ నకిలీ వెంచర్‌ను సృష్టించి ఇందుకు సంబంధించి బ్రోచర్ లు ఫోటోలు, బిల్ పేపర్స్ అన్ని పకడ్బందీగా నకిలీవి ముద్రించారు.


  Read this also ; Rajannasiricilla: అయ్యో చిట్టితండ్రి ఎంతపని జరిగింది.. దత్తత వెళ్లిన రెండు నెలలకే ఘోరం.


  ఇదివరకు వెంచర్‌లో స్థలాలు తీసుకున్న ఒకరిద్దరిని చూపించి బాలానగర్ మండలంలోని ఈదమగడ్డ తాండకు చెందిన 40 మందిని నమ్మించారు. ఇళ్ల స్థలాలు కావాలని వచ్చిన వారికి ఈ వెంచరు తమదేనని చూపించారు. తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మొత్తం రూ. కోటికి పైగా వసూలు చేశారు. ఇందులో డబ్బులు చెల్లించిన కొందరు తమకు స్థలాలు చూపించమని పట్టుబట్టారు. శంకర్ నాయక్ రేపు మాపంటూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అనుమానం వచ్చి కొందరు యాదగిరిగుట్ట శివారులోని వెంచర్‌కి నేరుగా వెళ్లారు. తాము బుక్ చేసుకున్న ఇళ్ల స్థలాలను చూపించాలని వెంచర్ ప్రతినిధులను కోరగా మీరు ఎవరు ఇక్కడ స్థలాలు అమ్మడం ఏంటి అని వెంచర్ నిర్వాహకులు ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మోసపోయామని గుర్తించిన ఈదమగడ్డ గ్రామస్తులు బాల నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  Read news ; Mulugu: ఫ్రెండ్ షిప్ పేరుతో హద్దులు దాటారు.. కానీ వాడు మాత్రం అలా చేస్తాడనుకోలేదు.


  బాలనగర్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. పైసా, పైసా కుడబెట్టుకోన్న డబ్బు మొత్తం అక్రమార్కుల చేతుల్లో పోశామని బాధితులు లబోదిబోమంటున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు