(N.Naveen Kumar,News18,Nagarkurnool)
నటనపై ఆసక్తితో సినిమాల్లో హీరోగా ఎదగాలని ఎంతో మంది యువత రంగుల ప్రపంచంలోకి వెళుతున్నారు. అవకాశాల కోసం డైరెక్టర్లు(Directors), ప్రొడ్యూసర్ల(Producers) చుట్టూ తిరుగతూ ఆశగా ఎదురుచూస్తుంటారు. గొప్ప నటులు కావాలని కలలుకంటూ శ్రమిస్తుంటారు. అయితే నటులుగా మారాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చిన వారిలో చాలా కొద్ది మందిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అందులోనూ హీరో, హీరోయిన్ వంటి లీడ్ రోల్స్(Lead roles) దొరికే అవకాశం వెయ్యి మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశాన్ని మన నాగర్‌కర్నూల్(Nagarkurnool)పట్టణానికి చెందిన యువకుడు దక్కించుకున్నాడు. ఈటీవీ(Etv)లో ప్రసారమయ్యే గీతాగోవిందం, రంగులరాట్నం వంటి సీరియల్స్(Serials)లో హీరోగా, ప్రధానపాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ నటుడు రాఘవ ప్రతాప్. తన ఎదుగుదల గురించి ఇండస్ట్రీలో ఎదురైన కష్టనష్టాల గురించి తనకు సహకరించి వారి గురించి హీరో రాఘవ ప్రతాప్(Raghava Pratap) న్యూస్18తో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
నటనపై అమితాసక్తితో హైదరాబాద్ పయనం:
నటన అంటే ఎంతో ఇష్టపడే రాఘవ..తాను స్కూల్లో చదువుతున్న సమయంలో 'మంచి నటుడవుతావు' అంటూ మాస్టారు చెప్పిన మాటలను నిజం చేసిన రాఘవ ప్రతాప్..తన నటనా ప్రయాణం వెనుక 9 ఏళ్ల శ్రమ ఉందని అంటున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు (రిటైర్డ్) సుధాకర్, రామదేవిల కుమారుడు రాఘవ ప్రతాప్. విద్యాభ్యాసం మొత్తం డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే పూర్తి చేశాడు. నటనపై ఉన్న ఆసక్తితో 2013లో తన తండ్రి నుంచి రూ. 500 తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. సినీ పరిశ్రమలో తెల్సిన వారు ఎవరు లేకపోయినా ఎంతో కకష్టపడి అవకాశాల కోసం ప్రయత్నించాడు రాఘవ ప్రతాప్. టిక్ టాక్, షార్ట్ ఫిల్మ్‌లు చేసిన రాఘవ సీరియల్స్, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈక్రమంలో కొన్ని యాడ్ మూవీస్ తన జీవితాన్ని మార్చేసాయని, సీరియల్స్‌లో ఈ స్థాయికి రావడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయని రాఘవ ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతం ఈటివీలో ప్రసారమయ్యే గీతాగోవిందం, రంగుల రాట్నం అనే సీరియల్స్‌లో హీరోగా నటిస్తున్నాడు.
స్కూల్ టీచర్ మాటను నిజం చేసిన రాఘవ:
స్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలో మ్యాథ్స్ టీచర్ రాజేష్ చెప్పిన మాటలునిజమయ్యాని రాఘవ చెప్పారు. స్కూల్లో జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రాంలలో ముందుండే రాఘవను చూసి 'సినిమాల్లోకి వెళితే మంచి నటుడివి అవుతావు' అంటూ రాజేష్ సార్ చెప్పేవారని, ఆయన సరదాగా అన్న ఆ మాటలతో తనకు నటన పట్ల ఆసక్తి పెరిగిందని రాఘవ చెప్పారు. డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారు. టిక్‌టాక్‌లు, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ మూవీస్ చేస్తే వచ్చే డబ్బులతో ఆడిషన్స్‌కు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు మల్లెమాల క్రియేషన్స్ నిర్మిస్తున్న సీరియల్స్‌లో లీడ్ ఆర్టిస్టుగా, హీరోగా అవకాశం దక్కించుకున్నారు.
ఈటీవీ సీరియల్స్‌లో హీరో పాత్రలు:
2019లో మల్లెమాల క్రియేషన్స్‌లో ప్రారంభమైన గీతాగోవిందం సీరియల్లో రాఘవ ప్రతాప్ హీరోగా సెలెక్ట్ అయ్యారు. అదే సమయంలో రంగుల రాట్నం సీరియల్లో సెకండ్ హీరోగా కూడా అవకాశం దక్కింది. ఈ రెండు సీరియల్లలో తనదైన నటనతో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాను నటుడిగా ఎదగడానికి సహకరించిన వారికి, తనపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు రాఘవ ప్రతాప్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool