రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
పాలమూరు జిల్లాలో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు నెలకొన్నాయి. మహబూబ్నగర్ జిల్లా నవాపేట మండల పరిధిలోని రహదారిపై పోలీస్ వాహనం బైక్ ని ఢీకొనడంతో ఒక యువకుడు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామ సమీపంలోని బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాలు ప్రకారం నవాబ్పేట మండలం రామ్ సింగ్ తండాకు చెందిన ఆకాష్ (25) శివకుమార్, హైదరాబాద్ లో టైల్స్ మేస్త్రిగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం పని ముగించుకుని హైదరాబాద్ నుంచి బైక్ పై వచ్చారు. తిరిగి హైదరాబాద్కు వెళుతుండగా పాలమాకులకు వద్ద పోలీసుల ఇన్నోవా వాహనం వెనుక నుంచి ఓవర్టెక్ చేస్తూ బైక్ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు బైక్ పైన కిందపడ్డారు ఆకాష్ అక్కడికక్కడే మృతిచెందగా శివకుమార్కు తీవ్ర గాయాల కోమాలోకి వెళ్లారు. అతని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భార్యలతో గొడవపడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.చేసుకున్న సంఘటనలు కలకాలం రేపింది. ముగ్గురు భార్యలతో మనస్పర్దాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారు.జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగన్నవాయి గ్రామానికి చెందిన వడ్ల మహేందర్ (35) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం మహేందర్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్ళాడు.మూడేళ్ల కిందట భార్యా పిల్లలను విడిచి లింగన్నవాయికి వచ్చాడు. తల్లిదండ్రులు నారాయణమ్మ మద్దిలేటి వద్ద ఉంటున్నాడు. కొంతకాలంగా మానసిక ఒత్తిడి గురయ్యారు. బుధవారం ఉదయం తల్లి తండ్రి ఇంట్లో లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలానికి చెందిన చిన్న మౌని ఆనంద్ (45)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్య మల్లమ్మతోమంగళవారం ఉదయం ఇంట్లో గొడవపడ్డారు. మనస్థాపాన్ని గురైన ఆనంద్ అదే రోజున పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుఎస్సై శంషుద్దీన్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంకొండాపూర్ గ్రామంలో భార్యతో గొడవపడిఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు రమేష్ కథనం ప్రకారం ఆంజనేయులు భార్య యాదమ్మ ఈనెల 15న గొడవపడ్డారు. మనస్థాపాన్ని గురైన ఆంజనేయులు పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కొడుకు రమేష్ చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి శ్రమించడంతో చనిపోయాడు. ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana