Home /News /telangana /

NAGAR KURNOOL PRIMARY HEALTH CARE CENTERS ARE SHORT OF ANTI VENOM MEDICINE FOR SNAKE BITE BRV NNK ABH

Nagarkurnool: పెరుగుతున్న పాముకాటు ఘటనలు: పీహెచ్‌సీలలో మందులు లేక ప్రాణాలమీదకు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 450 పాము కాటు కేసులు నమోదు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 450 పాము కాటు కేసులు నమోదు

గ్రామీణ ప్రజలు పాముకాటుకు గురైతే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని లేదా నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రులకు రావల్సి వస్తుంది. దీంతో ఆలస్యం జరగడంతో విషం శరీరమంతా విస్తరించి బడియూట్లు మృతి చెందిన సంఘటనలు నెలకొంటున్నాయి

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    N.Naveen Kumar, News 18, Nagarkurnool

    Nagarkurnool: పాము కాటేస్తే పీహెచ్‌సీలలో చికిత్స అందడం లేదు, ఏరియా ఆసుపత్రికి తీసుకుకొచ్చేలోపు ప్రాణం మీదకు వస్తుంది..యాంటీ వెనోమ్ (anti- venom) ఇంజక్షన్ల కొరతతో అందని వైద్యం,ఆలస్యం జరగడంతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు.. ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 450 పాము కాటు కేసులు.

    గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటుకు గురైతే మరణమే శరణ్యంలా పరిస్థితి తయారైంది. స్థానికంగా ఉండే పీహెచ్‌సీలలో(Phc) పాము కాటుకు విరుగుడు మందులు అందుబాటులో లేకపోవడం వలనే ఈ పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రజలు పాముకాటుకు గురైతే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని లేదా నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రులకు రావల్సి వస్తుంది. దీంతో ఆలస్యం జరగడంతో విషం(Poison) శరీరమంతా విస్తరించి బడియూట్లు మృతి చెందిన సంఘటనలు నెలకొంటున్నాయి. పీహెచ్‌సీలలో పాము కాటుకు సరైన వైద్యం లేకపోవడం వలనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు కొందరు బాధితులు అంటున్నారు.

    వర్షాకాల సీజన్ కావడంతో పొలాల మధ్య పాముల సంచారం పెరిగింది. పుట్టలో ఉండే పాములు చల్లటి వాతావరణం కోసం పంట పొలాల్లో, అడువుల్లో, చెరవు గట్ల మీద సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో అటుగా వెళ్లిన రైతులు, కూలీలు అనుకోకుండా పాము కాటు భారిన పడుతున్నారు. ఇలా ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ (mahabubnagar) జిల్లాలో ఇప్పటి వరకు 450 వరకు పాము కాటు కేసులు నమెదైనట్టుగా సమాచారం. ఈ సీజన్లో జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఒకరు పాటు కాటుకు గురికావడం, మృతి చెందిన దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.

    పాము కాటుకు బలవుతన్న గ్రామీణ ప్రజలు:
    నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లాలో పాముకాటుకు గురైన వారిలో ఎక్కువగా గ్రామంలో ఉండే రైతులే ఉండటం గమనార్హం. వ్యవసాయ పొలాల దగ్గర, కరిగెట దున్నుతున్నప్పుడు, కలుపు తీసే సమయంలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు గ్రామాల్లో పాత మట్టి ఇళ్లలో గోడ కన్నంలో పాములు చొరబడి కాటు వేసిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో వైద్యం అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.

    పీహెచ్‌సీలో అందుబాటులో లేని వైద్యం:
    పాముకాటు గురైనప్పుడు గ్రామీణ ప్రాంతల ప్రజలకు అందుబాటులో ఉండే పీహెచ్‌సీలలో సరైన వైద్యం అండటం లేదు. పాము కాటుకు విరుగుడు(antidote) మందు ఇచ్చే ఇంజక్షన్ల కొరత ఏర్పడం వలన బాధితులు జిల్లా, పట్టణ కేంద్రాల్లోని ఏరియా ఆసుపత్రులకు వెళ్తున్నారు. పాము కాటు వేసిన అరగంటలోపు చికిత్స చేస్తే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమయం మించిపోతే విషం శరీరమంతా విస్తరించి గుండెకు చేరుకొని బాధితులు చనిపోయే ప్రమాదముంది. పీహెచ్‌సీలలో సరైన వైద్యం, మందులు అందుబాటులో లేకపోవడం వలన ఏరియా ఆసుపత్రులకు రావల్సి వస్తుంది.

    Read this also; Nagarkurnool: ప్రభుత్వం ముందుచూపుతో చేసిన ఆ పనే.. ఇపుడు గర్భిణీల పాలిట వరమైంది..



    ఇంతలో సమయం మించిపోవడంతో జరగరాని నష్టం జరిగిపోతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 20 మండలాలు, 445 గ్రామాలకు గానూ 27 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, 178 సబ్ సెంటర్లు, ఒక పీపీ యూనిట్, ఒక జిల్లా ఆసుపత్రి ఉంది. వీటిల్లో పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో పాముకాటుకు సరైన చికిత్స లభించడం లేదు. ఆదునిక వైద్యం అందుబాటులో లేకపోవడంతో బాధితులు మూఢనమ్మకాలతో ఆకు పసరు వంటి నాటువైద్యాన్ని చేయించుకోవడంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం స్పందించి అన్ని పీహెచ్‌సీలలో పాముకాటు మందులు, ఇంజక్షన్లు, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు