హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఇక తెలంగాణ ప్రజలకు తీరనున్న ‘‘పవర్​ కట్​​ కష్టాలు’’.. కారణమిదే..

Nagarkurnool: ఇక తెలంగాణ ప్రజలకు తీరనున్న ‘‘పవర్​ కట్​​ కష్టాలు’’.. కారణమిదే..

పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

ప్రతి ఏడాది వరద ప్రారంభం కాగానే ప్రాజెక్ట్ అధికారులు ముందస్తుగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర  ప్రాజెక్టులకు వరద ప్రారంభం కావడంతో వచ్చే వారం పది రోజుల్లో వరద ప్రవాహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(N. Naveen Kumar, News18, Nagarkurnool)

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రియదర్శిని జూరాల విద్యుత్ ఉత్పత్తి (Power Generation)కేంద్రానికి వరంలా మారాయి. కర్నాటక (Karnataka)లోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు వరద తాకిడి పెరగడంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. జులై 11 రాత్రి 8 గంటల నుంచి పవర్ ప్లాంట్‌ (Power plant)కు నీటిని విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌కు 10,724 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో 2019లో అత్యధికంగా 639 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.

విద్యుత్ కేంద్రంలోని 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి:

వర్షాలు (Rains) సంవృద్ధిగా కురుస్తుండటంతో జూరాల (Jurala) జలాశయం జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ప్రతి ఏడాది వరద ప్రారంభం కాగానే ప్రాజెక్ట్ అధికారులు ముందస్తుగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద ప్రారంభం కావడంతో వచ్చే వారం పది రోజుల్లో వరద ప్రవాహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో తెలంగాణ జెన్ కో అధికారులు ఇప్పటి నుంచే జలాశయంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి వియోగిస్తున్నారు. మొదటి రోజు 10,724 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించారు. ఒక్కో పవర్ ప్లాంట్‌లో 2 యూనిట్ల చొప్పున మొత్తం 4 యూనిట్ల ద్వారా జూరాల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాలకు విద్యుత్ కష్టాలు తీరే అవకాశం ఉంది.

తెలంగాణలో (Telangana) కృష్ణానది మొదటగా నారాయణపేట జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. నీటిని నిల్వచేసుకునేందుకు, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం జూరాల ప్రాజెక్ట్ నిర్మించింది. 64 గేట్లతో కూడిన ఈ ప్రాజెక్ట్‌లో 9.657 టీఎంసీల నీటిని నిల్వచేసుకోగల సామర్థ్యం ఉంది. నీటి నిల్వతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రియదర్శిని (అప్పర్) జూరాల, లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రియదర్శిని (అప్పర్) జూరాల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా, లోయర్ జూరాలలో 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో నిర్మాణం చేపట్టారు. వరద ప్రవాహం క్రమంగా పెరిగితే మొత్తం 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు 40 వేల క్యూసెక్కుల వరకు నీటిని వినియోగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా జల విద్యుత్ కేంద్రంలోని 39 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక్కో యూనిట్ ద్వారా రోజకు 0.964 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.

2019 ఏడాదిలో అత్యధికంగా 693 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

గత 10 ఏళ్లలో జూరాల ప్రాజెక్ట్‌లో 2019 ఏడాదిలో లోయర్, అప్పర్ జూరాలలో కలిపి అత్యధికంగా 639 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. వీటిలో ప్రియదర్శిని (అప్పర్) జూరాల నుంచి 321 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాలలో 318 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది కూడా వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్న క్రమంలో సీజన్ ముగిసేలోపు గత రికార్డును తిరగరాసే స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి.

2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశాం: జెన్ కో ఎస్.ఈ, జయరాం, ఫోన్ నెంబర్: 7995024356

ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని, జులై 11 రాత్రి 8 గంటల నుంచి జూరాల జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్ కో ఎస్.ఈ జయరాం పేర్కొన్నారు.

First published:

Tags: Heavy Rains, Nagarkurnool, Power problems

ఉత్తమ కథలు