Home /News /telangana /

NAGAR KURNOOL POWER CUT AT DAYALASIS CENTER PATIENTS FEAR FOR LIFE IN NAGARKURNOOL DISTRICT ABH BRV NNK

Nagarkurnool: డయాలసిస్ కేంద్రంలో చికిత్స మధ్యలో ఉండగా నిలిచిపోయిన కరెంటు.. ఆందోళనకు గురైన రోగులు

రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

మంగళవారం ఆసుపత్రిలోని డయాలసిస్ విభాగానికి రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బెడ్ పై చికిత్స పొందుతున్న డయాలసిస్ రోగులు  ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తీవ్ర ఆందోళన చెందారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (N.Naveen Kumar, News 18, NagarKurnool)

  నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెడికల్ కలశాల వచ్చింది... ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం అని గొప్పలు చెప్తున్నా... ఆసుపత్రిలో కనీసం జనరేటర్ల (Electric genrators) సదుపాయం కూడా ఉండటం లేదు. మంగళవారం ఆసుపత్రిలోని డయాలసిస్(Dialysis) విభాగానికి రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బెడ్ పై చికిత్స పొందుతున్న డయాలసిస్ రోగులుప్రాణాలు అరచేతిలో పట్టుకొని తీవ్ర ఆందోళన చెందారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, జనరేటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

  ఏరియా ఆసుపత్రి నుండి జిల్లా జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందినప్పటికి డయాలసిస్( Dialysis) కేంద్రంలో కనీస వసతులైన మరుగుదొడ్లు, జనరేటర్ సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. నాగర్ కర్నూలుజిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి సుమారు 50 మంది డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు పాటు మరో 45 మంది రిగులు నిరీక్షణ లిస్టులో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి వెంటనే జనరేటర్ ఏర్పాటు చేసి రోగులకు మేలు చేయాలని బాధితులు కోరుతున్నారు.  వ్యక్తి మృతదేహం లభ్యం: మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర రోడ్డులో బోక్కల్లోనిపల్లి సమీపంలో గల కల్వర్టు వద్ద కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని రూరల్ పోలీసులు మంగళవారం గుర్తించారు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ప్రకారం మృతుడు మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన పోతురాజు వెంకటేష్ (32) గా గుర్తించారు. మృతుడికిమద్యం తాగే అలవాటు ఉందని, దాదాపు నెల కిందట హైదరాబాదులో కూలీపని చేయడానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లినట్టుగా ఎస్ఐ తెలిపారు.ఊహించని విధంగాఇలా రోడ్డు పక్కన మృతి చెందినట్లు తెలిపారు.

  చికిత్స పొందుతూ మహిళ మృతి: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఈదమ్మబండ తండాకు చెందిన ఉడిత్యవత్ లలిత (26) హైదరాబాదులో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై నర్సింహులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం తండాకు చెందిన ఉడిత్యవత్ రాజ్ కుమార్‌కు లలితతో కొంతకాలం క్రితం వివాహం అయింది.భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మనస్థాపాన్ని గురైన లలిత ఆగష్టు 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లలిత సోమవారం రాత్రి మృతి చెందింది. లలితకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి నినావత్ గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహులు తెలిపారు.

  Read This; Rajanna Sircilla: రాజన్న ఆలయంలో ఏం జరుగుతుంది?… ఒకే వ్యక్తికి 52 శాశ్వత అభిషేకం టికెట్లు జారీ
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

  తదుపరి వార్తలు