హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేద విద్యార్థులు బడికి వెళ్లేలా పోలీసుల చేయూత!..

పేద విద్యార్థులు బడికి వెళ్లేలా పోలీసుల చేయూత!..

X
పేద

పేద విద్యార్థులకు చేయుతనిస్తున్న అధికారిణి

Telangana: జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసు శాఖ వారు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే విధంగా విరాళాలు సేకరించి పలు విద్యాసామాగ్రిని అందజేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసు శాఖ వారు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే విధంగా విరాళాలు సేకరించి పలు విద్యాసామాగ్రిని అందజేశారు. కమ్యూనిటీ పోలిసింగ్ ఆధ్వర్యంలో పోలీసులు విరాళాలు సేకరించి గట్టు మండలంలోని ఎనిమిది పాఠశాల విద్యార్థులకు వారికి కావలసిన పాఠ్య పుస్తకాలను, ఇతర సామాగ్రిని అందజేసి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు వెళ్లేలా అవగాహన కల్పించారు.

అక్షరాస్యతలోగట్టు మండలం అత్యంత వెనుకబడిందిగా ఉంది. ఇక్కడి చిన్నారులు చాలావరకు పొలం పనులకు వెళ్లి విద్యకు దూరమవుతున్న సందర్భాలు నేటికీ కొనసాగుతున్నాయి. గతంలో ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని చేపట్టి బడి బయట పిల్లలను బడిబాట పట్టేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టి పెద్ద వరకు సక్సెస్ అయ్యారు.

దీని కొనసాగింపుగానే కమ్యూనిటీ పోలీసింగ్ తరఫున పోలీస్ శాఖ వారు పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు బాగా చదువుకోని ఉన్నత స్థాయికి చేరాలని, ఎవరూ కూడా బడి మానేసి పొలం పనులకు వెళ్లవద్దని,ఉపాధ్యాయులు అందిస్తున్న వెలుగులను స్వీకరించి భవిష్యత్ కలలను సాకారం చేసుకోని తల్లిదండ్రులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన విద్యార్థులకు సూచించారు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గట్టు మండలం మిట్ట దొడ్డి, చాగ దోన, చిన్నోనిపల్లీ, హిందువాసి గ్రామాలలోని 8 ప్రభుత్వ పాఠశాలలలో 17వందల మంది విద్యార్థులకు లక్ష 40 వేల రూపాయల విలువగలజామెట్రీ బాక్స్ లు, కంపాస్ బాక్స్ లుఆయా స్కూల్స్కు క్రీకెట్, వాలీబాల్, చెస్, క్యారమ్ బోర్డ్స్, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్ ను జిల్లా ఎస్పీ విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పటిలాగా లేవని, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కొనసాగుతున్నాయని, విద్యార్థులు ఉపాధ్యాయులు అందిస్తున్న వెలుగులను స్వీకరించి పట్టుదల, దృఢ సంకల్పంతో, క్రమశిక్షణతో చదివి భవిష్యత్ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఎవరూ కూడా బడి మానేసి పొలం పనులకు వెళ్ళవద్దని అన్నారు. పాఠశాలలలోవిద్యార్థులు, విద్యార్థినుల పట్ల సోదరభావంతో మెలగాలని, ఎవరూ కూడా ఇంట, బయట ఇతరులను లింగ భేదంతో చూడవద్దని సూచించారు. పోలీస్ శాఖ అందిస్తున్న వస్తువులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే ఆటవస్తువులు వినియోగించుకొని క్రీడలలో రాణించాలని సూచించారు.

కొందరు విద్యార్థులు ఒకసారి చెపితే గుర్తు పెట్టుకుంటారు, కొందరు రెండు సార్లకు, కొందరు పది సార్లకు చెపితే గుర్తు పెట్టుకుంటారని.. అయితే, ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, నిత్యం సాధన చేస్తూ ఉంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తద్వారా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ఎస్పీ అన్నారు.విద్యార్థుల భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మౌనం వీడి నిర్భయంగా బయటకు వచ్చిఉపాధ్యాయులకు తెలియజేసి వేధింపుల నుండి బయటపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలలో చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులను జిల్లా ఎస్పీ సన్మానించారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు