హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ట్రాన్స్ జెండర్లపై కేసులు...కారణం ఇదే..!

Nagarkurnool: ట్రాన్స్ జెండర్లపై కేసులు...కారణం ఇదే..!

ట్రాన్స్ జెండర్లపై కేసు

ట్రాన్స్ జెండర్లపై కేసు

Telangana: ట్రాన్స్ జెండర్లపై కేసు నమోదు;నగర వీధుల్లో, బస్టాండ్లో, రద్దీ ప్రదేశాల్లో చాలామంది ట్రాన్స్ జెండర్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి ప్రధాన వృత్తి బిక్షాటన దీని జీవనాధారంగా బతుకుతూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(N.Naveen Kumar,News18,Nagarkurnool)

ట్రాన్స్ జెండర్లపై కేసు నమోదు;నగర వీధుల్లో, బస్టాండ్లో, రద్దీ ప్రదేశాల్లో చాలామంది ట్రాన్స్ జెండర్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి ప్రధాన వృత్తి బిక్షాటన దీని జీవనాధారంగా బతుకుతూ ఉంటారు. ఇలాంటి ట్రాన్స్ జెండర్లు కొంతమంది చేసినటువంటి పనుల వల్ల ట్రాన్స్ జెండర్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కొంతమందిట్రాన్స్ జెండర్ ముసుగులో ప్రజలపై దాడులు చేయడం వలన, అవహేళనలుగా మాట్లాడడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు.

ట్రాన్స్ జెండర్లు భిక్షాటన అన్న చేస్తున్న క్రమంలో ఎవరైనా బిక్షం వేయడానికి నిరకరిస్తే వారిపై దాడులకు దిగడం వారిని దూషించడం అవమానకరంగా ప్రవర్తించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకోవడంతో ట్రాన్స్ జెండర్ ల పై కేసులు నమోదు చేసి పోలీసులు కౌన్సిలింగ్ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 15 మంది ట్రాన్స్ జెండర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవకు కారణమైన వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి వారికి కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు. కాగా ట్రాన్స్ జెండర్లు బస్టాండ్లో మహిళలపై దాడి చేయగా వారిచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాన్స్ జెండర్ లపై మరో కేసు నమోదయింది.

న్యూ గంజుకు చెందిన తారమ్మ తన ఆరోగ్యం బాగోలేక తన బంధువైన దేవితో కలిసి ఆసుపత్రిలో చూపించుకునేందుకు ఆటో కోసం బస్టాండ్ వద్ద నిలబడగా కొందరు ట్రాన్స్ జెండర్లు వచ్చి గొడవ పెట్టుకుని తిడుతూ పక్కనే ఉన్న కర్రలు తీసుకొని తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు దేవికి తీవ్ర గాయాలయ్యాయని తమను కొట్టిన వారి పేర్లు తెలుసుకోగా మేఘన, హేమ, కావ్య, చిట్టి, కుమారి అని తెలిసిందని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవి ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమపై ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు దాడి చేసి గాయపరిచారని పాత తోటకు చెందిన ట్రాన్స్ జెండర్ కావ్య ఇచ్చిన ఫిర్యాదుపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం బస్టాండ్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద తనతో పాటు మేఘన, కుమారి, హేమ, చిట్టీలు నిలబడి ఉండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చి తమను... ఫోన్, డబ్బులు ఇవ్వాలని అడగగా తాము ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో వాళ్లు తమ చేతుల్లో ఉన్న బ్లేడుతో దాడి చేసి గాయపరిచారని వారి పేర్లు తారమ్మ దేవి అని తెలిసిందని వారిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు వేరు వేరు ఘటనలో నమోదైన కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతరులపై దాడులు చేసినా, అసభ్యంగా ప్రవర్తించిన కఠిన చర్యలు చేపడతామని పోలీసులు ట్రాన్స్ జెండర్ లను హెచ్చరించారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు