హోమ్ /వార్తలు /తెలంగాణ /

నాలుగు రాష్ట్రాలు.. 30 చోరీలు.. ఈ ముఠా స్టైలే వేరు..! ఎలా చిక్కారంటే..!

నాలుగు రాష్ట్రాలు.. 30 చోరీలు.. ఈ ముఠా స్టైలే వేరు..! ఎలా చిక్కారంటే..!

వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల అరెస్ట్

వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల అరెస్ట్

వనపర్తి జిల్లా (Vanaparthy District) లో దారీ దోపిడీ ముఠాను వనపర్తి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలలుగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), నాలుగు రాష్ట్రాల్లో 44వ జాతీయ రహదారి సమీపంలో ఉండే గ్రామాల్లో 30 చోరీలకు పాల్పడుతూ దారి దోపిడీలుచేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

వనపర్తి జిల్లా (Vanaparthy District) లో దారీ దోపిడీ ముఠాను వనపర్తి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలలుగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), నాలుగు రాష్ట్రాల్లో 44వ జాతీయ రహదారి సమీపంలో ఉండే గ్రామాల్లో 30 చోరీలకు పాల్పడుతూ దారి దోపిడీలుచేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు వనపర్తి ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులను విచారణ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి శివారులో ఉదయం వాహన తనిఖీలు చేస్తుండగా జాతీయ రహదారిపై ఉన్న కర్నూలు వైపు వెళ్తున్న పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా టవేరా వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాహనంలోని వారంతా దొంగల ముఠాకు చెందిన నిందితులు రాజు, శంకర్ కాలే, విజయ్ రామ కాలే, గణపతి, శివాజీ కాలే, సంజీవ్, ఉమాజీ పవర్, నయుం, సలీం షేక్, అంబదాస్, రామచంద్ర, రుణకంటలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని విచారణ చేశామని వివరించారు.

మహారాష్ట్రలోని సోలిపూర్ జిల్లా అందగం ప్రాంతానికి చెందిన ముఠాగాగుర్తించారు. వీరందరూ తరచూ విహారయాత్ర ఆసుపత్రికి వెళ్ళొస్తామని చెప్పుకుంటూ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్నారని ఎనిమిది నెలల్లో నుంచి 30 చోరీలు చేశారని తెలిపారు. వ్యాపార దుకాణాల షట్టర్లను ఎత్తివేసి డబ్బులు విలువైన వస్తువులను చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు. వీరి వెంట కొందరు మహిళలు సైతం ఉంటారని వారు ఉదయం వేళలో చోరీ చేసేందుకు వ్యాపార దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించి పరిస్థితులు తెలుసుకుంటారని, ముఠాకు సమాచారం ఇస్తారని వివరించారు. వనపర్తి జిల్లా పరిధిలో రెండు ప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు.

ఇది చదవండి: భారీ చోరీలు.. హడలెత్తించిన దొంగలు

2022 సెప్టెంబర్ 11న అర్ధరాత్రి పెబ్బేరు పట్టణంలోని లక్ష్మీ దుర్గ హార్వెస్టర్ షోరూమ్ లో సెటర్ను ఎత్తి 14,000 రూపాయలను సమీపంలోని బజాజ్ హోమ్ నీడ్స్ షట్టర్ని ఎత్తి రూ.1000 రూపాయలను,2022 డిసెంబర్ 4వ తేదీన చిన్నంబాయి మండల కేంద్రంలో మహాలక్ష్మి వైన్ షాపును షెటర్ ఎత్తి రూ.9,600 రూపాయలు దొంగతనం చేసినట్టు విచారణలో ఒప్పుకున్నారు. షట్టర్లను ఎత్తేందుకు కావలసిన ఇనుపరార్లను వాహనం వెంట తీసుకొని దారిపడిన దోపిడీలు చేస్తూ నెలల తరబడి బయట ప్రాంతాల్లో ఉంటారని విచారణలో వీరు చెప్పుకొచ్చారు. వీరి నుంచి టవేరా వాహనం ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని పోలీసులు ప్రకటించారు.

ఇది చదవండి: జాబ్ ఇస్తామంటే గుడ్డిగా నమ్మకండి.. తేడా వస్తే అంతే సంగతులు

నగదు రికవరీ కాలేదని వీరు ఒప్పుకున్న చోరీలకు సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందజేశామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అడ్డాకుల మండలం ముత్యాలపల్లిలో ఎర్రచందనం చెట్లను నరికి దొంగలను ఎత్తుకెళ్లిన పోలీసులను పట్టుకున్నారు. ఈ ఘటన సంబంధించి బూత్పూర్ సిఐ రజిత రెడ్డి మంగళవారం వెల్లడిస్తూ ముత్యాలపల్లికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి తన పొలంలో ఎర్రచందనం చెట్లను పెంచుతున్నాడు. వాటిలో కొన్ని చెట్లు కోత దశకు లాగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల నాలుగున రాత్రివేళ 9 చెట్లను నరికివాటి కొమ్మలను వేరు చేసి దుంగలను ఎత్తుకెళ్లారు.

మరుసటి రోజు చెట్లను నరికి వేయడాన్ని గమనించిన రైతు అడ్డాకుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై విజయ్ కుమార్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సంఘం మండలం పురియా నాయక్ తండాకు చెందిన ముగ్గురు నిందితులు రాథోడ్ రవీందర్, రాథోడ్ శ్రవణ్ ,రాథోడ్ గోపాలను పట్టుకున్నారు. నిందితులు ఎర్రచందనం దొంగలను ఖద్దూస్ అనే వ్యక్తికి రూ. 1.05 లక్షలకు విక్రయించినట్లు సీఐ తెలిపారు. వచ్చిన డబ్బులను ముగ్గురు సమానంగా పంచుకోగా వారి నుంచి 75 వేల నగదును దొంగలను తరలించడానికి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కాగా మరో నిందితుడు రమేష్ దుంగలను కొనుగోలు చేసిన ఖద్దూస్ పరారీలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు