హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: సంక్రాంతి సెలవులకు వెళ్తున్నా..? పోలీసులేం చెబుతున్నారో చూడండి..!

Nagar Kurnool: సంక్రాంతి సెలవులకు వెళ్తున్నా..? పోలీసులేం చెబుతున్నారో చూడండి..!

సంక్రాంతి సీజన్ లో పోలీసుల హెచ్చరిక

సంక్రాంతి సీజన్ లో పోలీసుల హెచ్చరిక

సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలకు సెలవులు ఇస్తున్నారు.దీంతో చాలామంది పట్టణాలు విడిచి సొంత గ్రామాలకు, యాత్రల పేరిట ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలా వెళ్తున్న వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లడం జరుగుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలకు సెలవులు ఇస్తున్నారు.దీంతో చాలామంది పట్టణాలు విడిచి సొంత గ్రామాలకు, యాత్రల పేరిట ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలా వెళ్తున్న వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లడం జరుగుతుంది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటికి కన్నం వేస్తున్నారు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు నలుగురిలో గుర్తింపు కోసం కష్టపడి దాచుకున్న బంగారం, డబ్బు అవసరాలకు కూడా పెట్టినటువంటి నగదు ఒక్క రాత్రిలో దోచుకొని పోతున్నారు. దీంతో ఆర్థికంగా వారు కొన్ని ఏళ్ల పాటువెనక్కి వెళ్లాల్సిందే. కొన్నేళ్ల కష్టం ఒక్కరోజులోనే మాయమైతే వారి బాధ వర్ణనాతీతం.అయితే ఇటీవల చోరీ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన కేసులు పరిశీలిస్తే రాత్రి సమయంలో అధికంగా చోరీలు జరిగిన సంఘటన చోటుచేసుకున్నది. మహబూబ్ నగర్ జిల్లాలో 2020లో మొత్తం 201 దొంగతనం కేసులు నమోదు కాగా దీంట్లో 116 కేసులను ఛేదించారు. 2021లో 287 కేసులు నమోదు కాగా 194 కేసులను 2022లో 303 దొంగతనం కేసులు నమోదు కాగా 137 కేసులు చేదించారు. మొత్తంగా ఈ మూడేళ్ల కాలంలో 801 దొంగతనాలు కేసులు నమోదు కాగా 447 కేసులు పోలీసులు చేదించారు.చోరీ కేసుల్లో కోల్పోయిన సొమ్ము బాధితులకు లభించకపోవడంతో ఎంతోమంది ఆర్థికంగా చితికి పోతున్నారు. దొంగిలించిన సొమ్ములో దాదాపు 50% రికరీ రికవరీ కావడం లేదు. జిల్లాలో రాత్రి చోరీలు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెలవులు రావడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి గ్రామీణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు పయనం అవుతున్నారు.పండుగ వేడుకల మీద ఒకే సమయంలో తాళం వేసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు.

ఇది చదవండి: అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా.. బీ కేర్ ఫుల్!

ఇలాంటి ఇండ్లను లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఈ సీజన్ లో చాలా మేర దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఇటీవల తాళం వేసి ఉన్న ఇండ్లపై దొంగలు ఎక్కువగా దృష్టి సారించి దొంగతనాలు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిఉన్నదంతా ఊడ్చుకొని పోతున్నారు. రోజురోజుకు నేరగాళ్ల సంఖ్య పెరుగుతూ పోతుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మహబూబ్నగర్ సబ్ డివిజన్ పరిధిలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కాలనీలో గస్తీనిపెంచిన దొంగలు తమ పని కానిస్తున్నారు. దొంగలు ప్రధానంగా పట్టణ శివారు కాలనీలో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలని ఎంచుకుంటున్నారు. ఇన్ని చోరీలు జరుగుతున్న కొందరు ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించడం లేదు.

ఇది చదవండి: తల్లి కోసం చేసిన ప్రయత్నం.. ఇప్పుడు పెద్ద వ్యాపారమే అయింది..

చోరీలు జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోవడం లేదు. పోలీసులు ఇస్తున్న సూచన ప్రకారం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి ప్రయాణాలు పేరిట వెళ్లేవారు పక్కింటి వాళ్ళతోను, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిది. ప్రధాన ద్వారాలుకాకుండా ఇతర ద్వారాలు ఉంటే వాటికి తాళం వేస్తే మిగతా వాటికి లోపలి భాగాలకు తాళం వేయాలి.. అలా వేయడంతో ఇంట్లోని వాళ్ళు ఊరు వెళ్లారనే అనే అనుమానం రాకుండా ఉంటుంది.ఇంట్లో లేకున్నా గదుల్లో విద్యుత్ దీపాలు వేసి ఉంచాలి. దీంతో పాటు తాళం వేసినద్వారలు కనిపించకుండా కార్టైం వేస్తే కనబడకుండా ఉంటాయి.

విలువైన ఆభరణాలు నగదు వెంట తీసుకెళ్లాలి లేకుంటే బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలి. రాత్రిపూట ఒంటరిగా వెళ్లవలసి వస్తే మహిళలు తక్కువగా ఆభరణాలు ధరించాలి. ఊరు వెళ్ళే ముందు ద్విచక్ర వాహనాలు ఆరుబయట ప్రహరీ లోపల ఇంటి ముందు పెట్టి వెళ్ళకూడదు. వాహనానికి జాగ్రత్తగా తాళం వేసి సుపరిచితుల ఇళ్లలో పెట్టి వెళ్లడం చాలా మంచిది. సెలవుల్లో కుటుంబ సభ్యులు ఊరు వెళ్ళినప్పుడు ఆభరణాలకు రంగులు మెరుగులు అద్దుతాం అంటూ ఇళ్లకు వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారని గుర్తింపు కార్డు పరిశీలించడం మంచిది. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉంటే గదులు అద్దె కోసం వచ్చే వారికి లేవని చెప్పడమే ఉత్తమం.అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో సంచరిస్తూ ఉంటే 100కు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు