Naveen Kumar, News18, Nagarkurnool
గద్వాల జిల్లా (Gadwal District) లో జరుగుతున్న జాతరలో వింత వింత పోటీలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా సంక్రాంతి సంబరాలు వచ్చినా లేదా ఏవైనా గ్రామదేవతల జాతరలు జరిగిన అక్కడ ఎక్కువగా కోళ్ల పందాలు లేదా పశువుల బండలాగుడు పోటీలు లేదా కబడ్డీ (Kabaddi) పోటీలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఆయా జాతరలో నిర్వహిస్తూ భక్తులకు కనువిందు కలిగేలా ఆలయ అధికారులు చర్యలు చేపడుతూ ఉంటారు. ఈ పోటీల ద్వారా గెలుపు ఓటములను ప్రత్యక్షంగా చూడడం మానసిక ఉల్లాసం పొందడం వంటివి జరుగుతూ ఉండటం వల్ల జాతరలలో ఒక సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అయితే ఈ పోటీల్లో రకరకాల పోటీలు నిర్వహించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతరలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
ఇటీవల ఐజామండలంలో కేంద్రంలో జరిగిన ఓ జాతరలో పొట్టేళ్ల పందాలు నిర్వహించగా తాజాగా గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జాతరలో పందుల పోటీలు జరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి శివారులలో ఈ పోటీలు నిర్వహించారు. భూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా ఇక్కడ ఊర పందుల మధ్య పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పలువురు వరాహాలతో వచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు.
రెండేసి వరాహల మధ్య పోటీలు నిర్వహించి గెలుపొందిన వరాహం యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మొదటి స్థానానికి 30,000 రెండవ స్థానానికి 20,000 మూడవ స్థలానికి 10వేల నగదును అందజేశారు. పోటీలను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలో పాల్గొన్న వరహాలను చూసి కేరింతలు కొట్టారు. ఈ తరహా పందాలను నిర్వహించడంలో గద్వాల జిల్లా ప్రాంతం వాసులకే చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jogulamba gadwal, Local News, Nagarkurnool, Telangana