Home /News /telangana /

NAGAR KURNOOL PICKPOCKETERS SHOWED THEIR MOVES DURING INDEPENDENCE DAY CELEBRATIONS IN NAGARKURNOOL BRV NNK ABH

Nagarkurnool: సందట్లో సడేమియా: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చోరీ

 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చోరీ

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చోరీ

నాగర్‌కర్నూల్  జిల్లా కేంద్రంలో ఎస్పీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. పరేడ్ జరుగుతున్న క్రమంలో గుంపులోకి వచ్చి చేరిన జేబు దొంగలు అదునుచూసి చోరీకి పాల్పడ్డారు

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  N.Naveen kumar, News 18, Nagarkurnool

  Nagarkurnool; నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్పీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. పరేడ్ జరుగుతున్న క్రమంలో గుంపులోకి వచ్చి చేరిన జేబు దొంగలు అదునుచూసి చోరీకి పాల్పడ్డారు. వేడుకల కవరేజ్ కోసం వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధుల జేబులు కొట్టేశారు. కార్యక్రమానికి హాజరై వివిధ శాఖలలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి, జిల్లాలోని గ్రామపంచాయతీలకు అవార్డులు ప్రధానం చేసే కార్యక్రమంలో ఫోటోలు తీస్తుండగా ఇద్దరి జర్నలిస్టుల జేబులు కొట్టేసారు. ఒకరి జేబు నుంచి రూ. 2450 నగదు చోరీ కాగా మరొకరికి సంబంధించిన అక్రిడేషన్ కార్డు, ఐడి కార్డు, రూ. 1300 నగదును కాజేశారు దొంగలు. ఈ సంఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

  లిఫ్ట్ కాలువలో పడి రైతు మృతి: పొలం పనులకు వెళ్లిన రైతు లిఫ్ట్ కాలువలో జారిపడి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జయన్న కథనం ప్రకారం మండలంలోని కానాపురం గ్రామానికి చెందిన రైతు కురువ బాబు (44) తన వ్యవసాయ పొలంలో కరిగేటకు నీటిని వదలడానికి ఆదివారం రాత్రి పొలానికి వెళ్ళాడు. సోమవారం తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో భార్య సావిత్రి పొలానికి వెళ్లి చూడగా రైతు బాబు అమర్ చింత ఎత్తిపోతల లిఫ్ట్ కాలువ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సహాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందారని డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  వ్యక్తి అనుమానాస్పద మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన:
  కల్వకుర్తి టౌన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ తెలిపారు. కోడేరు మండలం నాగులపల్లికి చెందిన గణేష్ (23), లక్ష్మణ్‌లు హైదరాబాద్‌లో సెంట్రింగ్ పనులు చేసేవారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా బైక్‌పై స్వగ్రామానికి వెళ్లారు. మరుసటి రోజు శనివారం మద్దిమడుగు దేవస్థానానికి వెళ్లేందుకు హైదరాబాదులో ఉన్న స్నేహితులు చైతన్య, జితేందర్, తులసీరామ్, శంకర్‌లను రమ్మని ఫోన్ చేశారు. అనంతరం గణేష్, లక్ష్మణ్ బైక్‌పై... మిగిలిన నలుగురు వారి కారులో మద్దిమడుగు వెళ్లారు. ఆదివారం తిరిగి ప్రయాణం ఉండగా... అర్ధరాత్రి పట్టణంలోని జేపీనగర్ దగ్గరకు రాగానే గణేష్, లక్ష్మణ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. లక్ష్మణ్ కారులో ఉన్న స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో గణేష్‌ను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గణేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలు అయ్యి చికిత్స పొందుతున్నాడు. ఈ అంశంపై గణేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. గణేష్ ఒంటిపై కొట్టిన గాయాలు ఉన్నాయని, స్నేహితుల మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తా వద్ద భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గణేష్ భార్య శృతి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

  Read this also; Nagarkurnool: పొలానికి పిచికారీ చేసిన మందు దుష్ప్రబావంతో యువ రైతు మృతి  కారు ఢీకొని వ్యక్తి మృతి: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం చాగదోన గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అతని భార్య సరోజ, కుమారుడు యువరాజు ద్విచక్ర వాహనంపై ఆంధ్రప్రదేశ్లోని ఊరకుందు వీరన్న స్వామి దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా మాధవరం వద్ద వీరి బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మరణించాడు. భార్య సరోజ, కుమారుడు యువరాజు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Azadi Ka Amrit Mahotsav, Crime news, Local News, Nagarkurnool, Telangana

  తదుపరి వార్తలు