Naveen Kumar, News18, Nagarkurnool
ఆధ్యాత్మిక చింతనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) ప్రజలు ధ్యాన కేంద్రం వైపు ఆకర్షితులవుతున్నారు. ధ్యానం చేయడం ద్వారా సకల ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకంతో పిరమిడ్ ధ్యాన కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ధ్యానం చేయడం ద్వారా చాలా రకాల ఉపయోగాలను స్వీయ అనుభవం పొందుతూ చాలా రకాల ఉపయోగాలు కలుగుతున్నాయని ధ్యాన కేంద్రాలకు వెళ్ళేటువంటి ఔత్సాహికలు తెలుపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈశ్వరబి పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ కు చెందిన పోల మధుబాబు సొంత ఖర్చులతో ఈ పిరమిడ్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు.
పిరమిడ్ వ్యవస్థాపకులు పత్రీజీ సూచనలు మేరకే ఆయన భావజాలం ప్రతిబింబించేలాపిరమిడ్ ఆకారంలో ఈ భవనాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వందలాదిమంది ఈ పిరమిడ్ క్షేత్రానికి తరలివచ్చి ధ్యానం చేపడుతున్నారు. శ్వాస మీద ధ్యాసను ఉంచి ధ్యానం చేయడం ద్వారామానసిక ప్రశాంతతను పొందుతున్నామని ధ్యానం చేసే వారు చెప్తున్నారు.
ఈ నిర్మాణాన్ని తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేపట్టామని నిర్వాహకులు పోల మధుబాబు తెలిపారు. పదిమందికి ఉపయోగపడే విధంగా సమాజ సేవ చేయాలని ఆలోచనతోనే ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ధ్యాన కేంద్రం లేనటువంటి సమయంలో మార్కెట్ యార్డులో ఇతర ఖాళీ ప్రదేశాల్లో ధ్యానం చేపట్టే వారేవారమని అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కునేవారమని వివరించారు.
కుల, మత బేధాలు లేకుండా అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతోనే తాము ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈశ్వరబి పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి నాగర్ కర్నూల్ పట్టణంలోని చాలావరకు ఆధ్యాత్మికత చింతన కలిగిన వారంతా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం చేపడుతున్నారు. కేవలం శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియను మాత్రమే ప్రధానంగా ఎంచుకొని నిశ్శబ్దమైన వాతావరణంలో ఈ ధ్యానం చేస్తున్నారు. వీటి ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతున్నాయని ధ్యానం చేస్తున్నవారు తెలుపుకోచ్చారు. ధ్యానం చేయడం అనేది తమను తాము తెలుసుకునే ప్రక్రియ అని మనసు ప్రశాంతం చేసుకుని ప్రక్రియ అని వివరించారు. పిరమిడ్ ఏర్పాటు చేయడం ద్వారా ధ్యానం చేసుకోవడానికి స కల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana