హోమ్ /వార్తలు /తెలంగాణ /

వామ్మో.. ఆ జిల్లాలో పేరుకుపోయిన పెండింగ్ ట్రాఫిక్ చలానాలు.. ఎంతంటే..

వామ్మో.. ఆ జిల్లాలో పేరుకుపోయిన పెండింగ్ ట్రాఫిక్ చలానాలు.. ఎంతంటే..

పేరుకుపోయిన పెండింగ్ చలానాలు

పేరుకుపోయిన పెండింగ్ చలానాలు

Telangana: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,20,548 వాహనాలు ఉన్నాయి. అందులో ద్విచక్ర వాహనాలు 75,018, కార్లు 7857, గూడ్స్ వాహనాలు 5696, ఆటో రిక్షాలు 4733, గూడ్స్ ఆటో రిక్షాలు 1149 పెండింగ్ లో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,20,548 వాహనాలు ఉన్నాయి. అందులో ద్విచక్ర వాహనాలు 75,018, కార్లు 7857, గూడ్స్ వాహనాలు 5696, ఆటో రిక్షాలు 4733, గూడ్స్ ఆటో రిక్షాలు 1149, వ్యవసాయ రంగానికి ఉపయోగించే టాక్టర్లు 7155, కమర్షియల్ పరంగా ఉపయోగించే టాక్టర్లు 5447, స్కూల్ బస్సులు 306 మరియు వివిధ రకాల వాహనాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.

జిల్లా వ్యాప్తంగా 20 మండలాల వారీగా 5949 వాహనాల యజమానులు తమ రవాణా వాహనాలకు సంబంధించిన పన్నులు చెల్లించకుండా రోడ్లపై తిప్పుతూ ప్రభుత్వ ఖజానాకు 50 కోట్ల రూపాయలు చెల్లించకుండా గండికొడుతున్నారు. వాటిల్లో అధికంగా 1048 లారీలు, ట్రాలీలు, స్కూలు బస్సులు ఉన్నాయి.1293 ట్రాన్స్పోర్ట్ వాహనాలుఇప్పటికి పనులు చెల్లించకుండా వాహనాలు రోడ్డు రవాణా నిబంధనలను ఉల్లంఘించి యధేచ్చగారోడ్లపై సంచరిస్తున్నాయి.

గత కొన్ని మాసాలుగా స్పెషల్ డ్రైవ్ లో 100 వాహనాలను సీజ్ చేసి 30 లక్షల రూపాయలను వాహనదారుల నుండి ప్రభుత్వ ఖజానాకు చెల్లించడం జరిగిందని రవాణా శాఖ అధికారి చెప్పారు.5949 వాహనా దారులు 50 కోట్ల రూపాయల మొండి బకాయిలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.వాహనాల వారీగా టాక్స్ పెండింగ్ జాబితాను జిల్లా అధికారులు రూపొందించారు.

స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాలు విధించేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు.వాహనదారులు తమకు తాము టాక్సీ నేనుగా కట్టితే వారికి డబ్బులు ఆదా అవుతాయని తనిఖీల్లో పట్టుబడితే 200% అధికంగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని వాహనదారులను అధికారులు హెచ్చరిస్తున్నారు.రాష్ట్రస్థాయి ఉన్నత అధికారుల ఆదేశాల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అధికారుల సిద్ధమవుతున్నారు.

మండలాల వారీగా పన్ను చెల్లించని వాహనాల వివరాలు

నాగర్ కర్నూల్ లో 658 వాహనాలు, కల్వకుర్తిలో 553 వాహనాలు, అచ్చంపేటలో 463 వాహనాలు, అమ్రాబాద్ లో 200 వాహనాలు, బల్మూర్ లో 211 వాహనాలు, బిజినపల్లిలో 491 వాహనాలు, చారకొండలో 260 వాహనాలు, కోడేరులో 253 వాహనాలు, కొల్లాపూర్ లో 303 వాహనాలు, లింగాలలో 186 వాహనాలు, పదరాలో 49 వాహనాలు, పెద్దకొత్తపల్లి లో 371 వాహనాలు, పెంట్లవెల్లిలో 92 వాహనాలు, తాడూరులో 312 వాహనాలు, తెలకపల్లి లో 269 వాహనాలు, తిమ్మాజిపేటలో 332 వాహనాలు, ఉప్పునుంతలలో 241 వాహనాలు, ఊరుకొండలో 141 వాహనాలు, వంగూరులో 300 వాహనాలు, వెల్దండలో 260 వాహనాలు మరియు ఇతర ప్రాంతాల నుండి జిల్లాలో ఉంటున్న 4 వాహనాలతో పాటు మొత్తం 5949 వాహనాదారులు 50 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జిల్లా రోడ్లపై సంచరిస్తున్నాయి.

*ప్రత్యేక తనిఖీలకు సిద్ధం*

జిల్లాలో 5949 వాహనా యజమానులు ప్రభుత్వానికి పన్ను బకాయి ఉన్నాయని రవాణా శాఖ అధికారి ఎర్రిస్వామి తెలిపారు.పన్నుల రూపంలో ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు కావలసి ఉందన్నారు.ఈ వాహనాలపై చర్యలకు రవాణా శాఖ ఉపక్రమించిందని చెప్పారు.. పన్ను బకాయి ఉన్న వాహనలపై పోలీస్ శాఖ సహాయం తీసుకుని మోటార్ వాహన ఇన్స్పెక్టర్ ల ద్వారా తనిఖీలు (స్పెషల్ డ్రైవ్స్) నిర్వహిస్తామన్నారు.గత కొన్ని నెలల్లో 100 వాహనాలపై కేసుల నమోదు చేసి రూపాయలను వసూలు చేసామని తెలిపారు.ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడితే వాహనాల యజమానులపై కేసులతో పాటు 200% జరిమానా విధించి పన్ను వసూలు చేస్తామని హెచ్చరించారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana, Traffic challan

ఉత్తమ కథలు