హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking: చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించడం కష్టం.. ఈ ఘటన చూస్తే అదే నిజమనిపిస్తుంది..!

Shocking: చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించడం కష్టం.. ఈ ఘటన చూస్తే అదే నిజమనిపిస్తుంది..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Gadwal: మృత్యువు ఎటువైపునుంచి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. అప్పటివరకు చక్కగా మాట్లాడిన వారు నిముషాల వ్యవధిలో విగత జీవిలుగా మారుతుంటారు. అలాంటి షాకింగ్ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది

 • News18 Telugu
 • Last Updated :
 • Gadwal, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  మృత్యువు ఎటువైపునుంచి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. అప్పటివరకు చక్కగా మాట్లాడిన వారు నిముషాల వ్యవధిలో విగత జీవిలుగా మారుతుంటారు. అలాంటి షాకింగ్ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికుడు తెలియని కారణంతో మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba District) అలంపూర్ మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి కర్నూలు (Kurnool)వరకు ప్రయాణిస్తున్న వ్యక్తి గమ్యస్థానం చేరుకొనే 10 నిమిషాల ముందు హఠాన్మరణం చెందాడు. ఎస్సై బాలరాజు తెలిపిన ప్రకారం హైదరాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ఆదోనికి బయలుదేరింది. మార్గమధ్యంలో జడ్చర్ల బస్టాండ్‌లో రమేష్ (38) అనే ప్రయాణికుడు ఎక్కి కర్నూలు టికెట్ తీసుకున్నాడు. మరో 10 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానం చేరుకోవాల్సి ఉండగా ఇటికలపాడు శివారు చేరుకుంటున్న క్రమంలో చిల్లర తీసుకునేందుకు డ్రైవర్ వద్దకు వచ్చిన రమేష్ చిల్లర ఇవ్వాలని కోరాడు.

  డ్రైవర్ దిగేటప్పుడు ఇస్తానని చెప్పడంతో డ్రైవర్ వెనుకనున్న ఖాళీ సీటులో కూర్చున్నాడు. అంతలోనే సీటులో వాలిపోయాడు. గమనించిన డ్రైవర్ వేగంగా అలంపూర్ చౌరస్తాకు తీసుకొచ్చి ఇతర ప్రయాణికుల సాయంతో 108 వాహనంలో అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పోలీసులు చేరుకొని రమేష్ ప్రకాశం జిల్లా (Prakasham District) కురిచేడు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  ఇది చదవండి: నిర్మిస్తే సరిపోదు.. రోడ్లు కూడా వేయాలిగా.. రాజన్న జిల్లాలో వింత పరిస్థితి..

  పండుగ రోజు విషాదం: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం షేర్ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు కృష్ణా నదిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వెంకటరాముడు కుమారుడు నరేందర్ (17) తన చిన్నమ్మను బుధవారం ఇంటికి తీసుకొచ్చాడు. చిన్నమ్మ కొడుకు కుమార్ తో కలిసి గ్రామంలో నీటి ట్యాంకు వద్ద ద్విచక్ర వాహనాన్ని శుభ్రం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి స్థానం చేయడానికి సవిపంలోని కృష్ణా నదికి వెళ్లారు. నదిలో ఈత కొట్టారు. నీటి ప్రవాహంలో ప్రమాదవశాత్తు నరేంద్ర మునిగిపోతుండగా గమనించిన తమ్ముడు కుమార్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు అక్కడికి చేరుకొని నదిలో కొట్టుకుపోతున్న నరేందర్‌ను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  మద్యం దుకాణంలో చోరీ: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని భవాని మద్యం దుకాణంలో రూ. 95000 విలువగల మద్యం చోరీకి గురైంది. ఏఎస్ఐ ఉస్మాన్ ఖాన్ ప్రకారం నారాయణపేట రోడ్డులో గల భవాని మద్యం దుకాణాన్ని నిర్వాహకులు బుధవారం షాపు తెరిచేందుకు వచ్చారు. షాపు రేకులు ఊడి పడి ఉండడం గమనించారు. కౌంటర్ లోని రూ. 95,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. షాపు యజమాని కార్తీక్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని సీఐ జనార్ధన్ వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Jogulamba gadwal, Local News, Telangana

  ఉత్తమ కథలు