హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్లిన ఇరువురు స్నేహితులు.. తిరిగి వస్తుండగా అనుకోని ఘటన..

Nagarkurnool: హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్లిన ఇరువురు స్నేహితులు.. తిరిగి వస్తుండగా అనుకోని ఘటన..

శ్రీశైలంలో ప్రమాదం

శ్రీశైలంలో ప్రమాదం

సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన ఆకాష్ (25) తన స్నేహితులతో కలిసి గత ఆదివారం కారులో శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం నుంచి బుధవారం తిరిగి హైదరాబాద్ (Hyderabad) ప్రయాణం అయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లా అమ్రాబాద్ మండలంలోని మున్ననూరు సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన ఆకాష్ (25) తన స్నేహితులతో కలిసి గత ఆదివారం కారులో శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం నుంచి బుధవారం తిరిగి హైదరాబాద్ (Hyderabad) ప్రయాణం అయ్యారు. మున్ననూరు సమీపంలో అతివేగంగా వచ్చిన కారు కల్వర్టును ఢీకొని రోడ్డు అంచున కింద పడిపోయింది. దాంతో డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రవితేజకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అమ్రాబాద్ సిఐ ఆదిరెడ్డి ఎస్ఐ వీరబాబు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆకాష్ తండ్రి నింజా నాయక్ వనపర్తి (Vanaparti) జిల్లా కేంద్రంలో కమ్యూనికేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

  భార్యతో గొడవపడి ఆత్మహత్య:

  భార్యతో గొడవపడిన వ్యక్తి ఆత్మహత్యకు (Husband Suicide) పాల్పడిన ఘటన బుధవారం వనపర్తి జిల్లా మదనపురం మండలం అజ్జకోలులో చోటుచేసుకుంది. మదనపురం ఎస్సై జగన్నాథరెడ్డి కథనం మేరకు పిట్టల కొండన్న (27) మంగళవారం భార్యతో గోడవపడ్డాడు. మనస్థాపానికి గురైన కొండన్న గడ్డి మందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ కొండన్న మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  యువతి అదృశ్యం: 

  నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో గట్టు కాడేపల్లిలో మంగళవారం ఓ యువతి (19) అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఏఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే కూతురు ఇంట్లో లేదని యువతి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Nagarkurnool

  ఉత్తమ కథలు