Naveen Kumar, News18, Nagar Kurnool
పశు పోషణ ద్వారా లాభాలు గడించాలని గేదెలను, కోళ్లను, గొర్రెలను ,మేకలను, బాతులను, కుందేళ్లను వంటి రకరకాల జీవులను పెంచుతూ లాభాలు గడిస్తారు.వాటికోసం ప్రత్యేకంగా షెడ్లను వేసి పెంచుతారు. వీటి ద్వారా లభించే గుడ్లు, పాలు, మాంసాలను విక్రయించి వ్యాపారం చేస్తుంటారు. ఈ తరహా వ్యాపారాలు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ వ్యాపారాలని కాంపిటీషన్ పెరిగిపోవడంతో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు కొత్తరకంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు.
Read Also : Peddapelli: బయట నుండి చూస్తే కంటైనర్.. డోర్ తీస్తే లోపల లగ్జరీ ఇల్లు
సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వీడియోస్‌ను చూసి ఇతర రాష్ట్రాల్లో బాగా సాగు చేస్తున్నటువంటి గాడిదల పెంపకాన్ని ఎంచుకున్నాడు. ఆలోచన రాగానే కుటుంబ సభ్యులతో చర్చించి డాంకీ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ప్రోత్సాహంతో దాదాపుగా కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టి తమ సొంత పొలంలో 60 గాడిదలను తీసుకువచ్చి పెంపకం మొదలుపెట్టారు. గుజరాత్ , కశ్మీర్, హర్యానా వంటి ప్రాంతాల నుంచి గాడిదలను తీసుకొచ్చి పెంచుతున్నారు.
ఒక్కో గాడిదను తీసుకురావడానికి 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని మరికొన్ని మేలు రకం జాతి గాడిదలను తీసుకొచ్చేందుకు లక్ష నుంచి 1,50,000 వరకు ఖర్చు కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు. తమకున్న ఆరెకరాల పొలంలో వీటి కోసం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి వాటి ఫీడింగ్ కోసం డెలివరీస్ కోసం ఇతర అవసరాల కోసం నిర్మాణాలను చేపట్టారు. మొత్తంగా 70 గాడిదల కోసం ఇప్పటివరకు 70 లక్షల వరకు ఖర్చు వచ్చిందని అఖిల్ తండ్రి నాగేష్ చెప్పుకొచ్చారు.
అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ కుమారులను ఇతర దేశాలకు పంపించడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడడం వంటి ఆలోచనలతో ఉంటారు. కానీ అఖిల్ తండ్రి మాత్రం ఇంటి దగ్గరే ఉంటూ స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతోనే ఈ తరహా డాకి ఫామ్ ఎంచుకున్నామని వివరించారు. తాము తీసుకొచ్చిన ఈ డాంకీలు అన్నింటికీ కలిపి రోజుకు 15 లీటర్ల వరకు పాలు వస్తున్నాయని తెలిపారు. వీటిని వివిధ ఔషధ కంపెనీలు అగ్రిమెంట్ చేకూర్చుకొని ప్రతిరోజు వచ్చి తీసుకుంటున్నారని చెప్పారు.
ఒక లీటర్ గాడిద పాలను 4500 నుంచి 5 వేల వరకు విక్రియిస్తున్నామని తెలిపారు. తమ ఫామ్ దగ్గరికి ఎవరన్నా వచ్చి పది మిల్లీమీటర్లు 20 మిల్లీలీటర్ల పాలు అడిగితే వాటిని 200 నుంచి 400 వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నామని తెలిపారు. పాలను చాలా వరకు మెడికల్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఎన్నో రకాల వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి వినూత్నంగా ఆలోచించిన అఖిల్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు.
ఈ ఈ గాడిదల పోషణ చూసుకునేందుకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చామని మొత్తంగా 4 కుటుంబాల కూలీలు ఈ గాడిదల చూసుకోవడానికి ఉన్నారని వివరించారు. ఇలాంటి కాంపిటీషన్ లేని బిజినెస్ చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఉద్దేశంతోనే ఇతరహా వ్యాపారాన్ని తాము ఎంచుకున్నామని స్పష్టం చేసారు.ఎవరైనా డాంకీ ఫారం పెట్టాలనుకుంటే వారికి సరైన సూచనలు సలహాలు కూడా తాము ఇస్తామని అఖిల్ చెప్పారు.
ఫోన్ నెంబర్ 7036012722
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana