నల్లమల అటవీ ప్రాంతంలో ఈ అగ్ని దేవుడు విలయ తాండవం చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే అగ్ని ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ఫారెస్ట్ లో 10కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో వృక్ష సంపద, వన్యప్రాణులు, పక్షులు, కీటకాలే కాకుండా మనుషుల ఆవాసాలు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
ఒక్కసారి కార్చిచ్చు రగిలిందంటే అది దావనంగా వ్యాపిస్తూనే ఉంటుంది. అడవిలో ఎండు గడ్డికి ఎక్కడైనా నిప్పురవ్వలు రాజుకుంటేవాటికి గాలి తోడవడంతో క్షణాల్లోనే అగ్ని వేగంగా ప్రవహిస్తుంది. నిప్పులు చిమ్ముకుంటూ ఆ చుట్టూ ముట్టంతా దహించుకు పోతుంది.
ఇందులో చాలావరకు అటవీ సంపద అటవీ జంతువులు నష్టపోవడమే కాక మనుషుల ఆవాసాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ సమాచారం ఫారెస్ట్ శాఖ పరిధిలోని నుండి వాచర్లు ఉన్నతాధికారులకు అందించి అక్కడి నుంచి ఫైర్ ఇంజన్లు శాఖకు సమాచారమిచ్చి ఫైర్ ఇంజన్లు అడవి ప్రాంతంలోకి చేరుకునే వరకు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతూనే ఉంది. అయితే ఈ ప్రమాదాలను అరికట్టేందుకుఅడవిలో మధ్య మధ్యలో నీటి కాలువలను ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్ని వ్యాపిస్తున్నసమయంలో నీటి కాలువల సమీపానికి చేరగానే అక్కడున్నటువంటి నీటికి మంటలు ఆరిపోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో చెంచుల నివాసాలు సైతం అగ్నికి ఆహుతి అయ్యాయి. మార్చి 3నతెల్లవారుజామున అచ్చంపేట పరిధిలోరామ్ పెంట లో ఒక్కసారిగా నాలుగు గుడిసెలు కాలిపోయాయి. ఇందులో అంగన్వాడి కేంద్రం కావడం విశేషం. చెంచులు తెలిపిన వివరాల ప్రకారం అంగన్వాడి కేంద్రంచుట్టూ నిప్పు రవ్వలు ఎగిసి పడుతుడటంతో పక్కనే ఉన్న చిగురుల లక్ష్మయ్య, నిమ్మల పాపయ్య, నిమ్మల బాలయ్య, గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి.సోలార్ లైట్లతో పాటు గుడిసెలోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Local News, Nagarkurnool, Telangana