హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఆ వైన్స్ షాపులో నకిలీ మద్యం.. తాగినోడి పరిస్థితి ఏంటి?: దుకాణం సీజ్ చేసిన అధికారులు 

Nagarkurnool: ఆ వైన్స్ షాపులో నకిలీ మద్యం.. తాగినోడి పరిస్థితి ఏంటి?: దుకాణం సీజ్ చేసిన అధికారులు 

నాగర్​కర్నూల్లో కల్తీ మద్యం

నాగర్​కర్నూల్లో కల్తీ మద్యం

నకిలీ మద్యం అమ్ముతున్న ఓ వైన్​ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రంలో ఉన్న వైన్స్ షాపులో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

(Naveen Kumar, News18, Nagarkurnool)


మద్యం దుకాణం సీజ్: నకిలీ మద్యం (Alcohol)అమ్ముతున్న ఓ వైన్స్ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వనపర్తి (Vanaparti) జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రంలో ఉన్న వైన్స్ షాపులో నకిలీ మద్యంవిక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆగష్టు 22న వైన్స్ షాపుపై దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు కొన్ని మద్యం బాటిళ్లను పరిశీలించారు. అనంతరం అది నకిలీ మద్యంగా నిర్ధారించుకుని వైన్ షాపును సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై వివరించారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించామని, అక్రమ మరియు నకిలీ మద్యం విక్రయించే వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ మద్యం తాగిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇలా కల్తీ మద్యం తాగిన తమకు ఏమవుతుందోనని భయపడుతున్నారు.


లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి:


మహబూబ్​నగర్​ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంటిలో లిఫ్ట్ కోసం తవ్విన గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చాకలి శేఖర్(52) అమౌంట్ ప్లాజా అపార్ట్మెంట్లోవాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం అపార్ట్మెంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న శంకర్ రెడ్డి ఇంటి నిర్మాణం వద్ద పనికి కుదిరాడు.గురువారం రాత్రి 7:30 గంటలకు కొత్తగా చేపడుతున్న ఇంటి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 11 గంటలైనా శేఖర్ ఇంటికి రాకపోవడంతో, భార్య భాగ్యమ్మ.. తెలిసిన వారికి సమాచారం ఇచ్చింది. ఈక్రమంలో వారు నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా లిఫ్ట్ కోసం తొవ్విన గుంతలో శేఖర్ పడి ఉన్నాడు. నీరు ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేక నీటిలో మునిగి చనిపోయినట్లు గుర్తించారు. భర్త మరణంపై తనకు ఎలాంటి అనుమానం లేదని భార్య ఫిర్యాదులో పేర్కొంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Telangana: టీఆర్​ఎస్​ లీడర్లకు మావోయిస్టుల హెచ్చరిక..! డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్​


మరో చోరీ ఘటన: వనపర్తి (Vanaparti) జిల్లా ఆత్మకూరు మండలంలో తాళం వేసిన ఇంటికి కొందరు దుండగులు కన్నం వేసి బంగారం నగలు దోచుకొని పోయారు. ఆత్మకూరు పట్టణంలోని అయ్యప్ప కాలనీలో నివాసముంటున్న ఆర్టీసీ కండక్టర్ మల్లేష్ - భార్య జ్యోతితో కలిసి రెండు రోజుల క్రితం ఒంగోలుకు వెళ్లి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఇల్లు తెరిచి ఉండడాన్ని గమనించిన పొరిగింటి వారు మల్లేష్ కు సమాచారం ఇచ్చారు. అనంతరం మల్లేష్ సూచన మేరకు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకొన్న మల్లేష్ బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం చైన్,రూ. 30 వేల నగదు దోచుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Alcohol, Local News, Nagarkurnool, Police arrest

ఉత్తమ కథలు