హోమ్ /వార్తలు /తెలంగాణ /

నాగర్ కర్నూల్ జిల్లాలో 9 గ్రామ పంచాయతీలకు జాతీయస్థాయి అవార్డులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో 9 గ్రామ పంచాయతీలకు జాతీయస్థాయి అవార్డులు..

పంచాయతీ అవార్డులు గెలుచుకున్న గ్రామం

పంచాయతీ అవార్డులు గెలుచుకున్న గ్రామం

Telangana: గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలను బేరీజుగా వేసుకొని జాతీయస్థాయిలో జాతీయ అవార్డులను ప్రధానం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(N.Naveen Kumar,News18,Nagarkurnool)

గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలను బేరీజుగా వేసుకొని జాతీయస్థాయిలో జాతీయ అవార్డులను ప్రధానం చేశారు. ఈ అవార్డులను నాగర్కర్నూల్ జిల్లాలో తొమ్మిది గ్రామపంచాయతీలకు అవార్డు రావడం విశేషంగా నిలిచింది.

ఇందుకు కృషిచేసిన గ్రామపంచాయతీ సర్పంచ్లను పంచాయతీ కార్యదర్శులను, జిల్లా అధికారులను ఘనంగా సత్కరించారు. ఒక గ్రామం పైన ఎంతో నిబద్ధతతో గ్రామ అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో విధిగా నిధులు నిర్వహించడం వలన ఇలాంటి అవార్డులు సొంతమవుతాయని జడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి అభినందించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీ సెక్రటరీలకు సన్మానాలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి సాధించాల్సిన9 సంకల్పాలు కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైనసర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందికి అవార్డులు మెమోంటోలుప్రధానం చేసిసన్మానించారు. ఈ సందర్భంగాజడ్పి ఛైర్పర్సన్ శాంత కుమారి మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తిని రానున్న రోజుల్లో కొనసాగించి అన్ని అంశాల్లో జిల్లాలోని 461గ్రామ పంచాయతీలు కేంద్రప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది సంకల్పాలు వంద శాతం సాధించాలనిఆకాంక్షించారు.ఇందుకు గ్రామ సర్పంచులు, పంచాయతి సెక్రటరిలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కను బతికించుకునే విధంగా కృషి చేయాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరిమాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయని ఆ సమస్యలను అధిగమించి వివిధ థీమ్ లలో కష్టపడి తమ గ్రామఅభివృద్ధికి కృషి చేసిన గ్రామ పంచాయతీ బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ జాతీయ దీన్ దయాల్ గ్రామ పంచాయతీ అవార్డులను 9 కేటగిలుగా విభజించి ప్రతి కేటగిరీలో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి మూడు గ్రామ పంచాయతీలకు మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు కేటాయించి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ తొమ్మిది కేటగిరిల్లో 1. పేదరిక నిర్ములన మెరుగైన జీవనోపాధి,2. ఆరోగ్యకర గ్రామపంచాయతీ, 3. పిల్లల ఆరోగ్యం స్నేహపూర్వకత 4. తాగునీటి ఇబ్బందులు లేకుండా సరిపడా తాగునీరు, 5. శుభ్రత మరియు ఆకుపచ్చ గ్రామపంచాయతీ, (క్లిన్ అండ్ గ్రీన్) 6.మౌళిక సదుపాయల్లో స్వయం సమృద్ధి, 7. సామాజిక భద్రత బలోపేతం, 8. సుపరిపాలన 9. మహిళా స్నేహపూర్వకత సాధికారత వంటి 9 థీమ్ లను ఎంచుకొని 2030 నాటికి వీటిని వంద శాతం సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.2022 సంవత్సరానికి గాను ఈ 9 థీమ్ లలో బాగా కృషి చేసిన గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతి సెక్రటరీ, సిబ్బందికి సన్మానం చేసుకోవడం జరుగుతుందన్నారు.

ఇదేవిధంగా రాష్ట్రస్థాయిలో మార్చి31న హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖఆడిటోరియం రాజేంద్రనగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి అవార్డులు ఉంటాయని,ఇప్పుడు అవార్డు పొందిన 27 గ్రామ పంచాయితీల సర్పంచులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.జిల్లా నుండి వందశాతం లక్ష్యం సాధించిన 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అందులో అల్లపూర్, జూపల్లి, వస్రాం తాండ, ఎర్రవల్లి ఉన్నాయన్నారు.

పిల్లల స్నేహపూర్వక సంకల్పంలో మొదటి స్థానంలో ఉన్న అల్లపూర్ గ్రామ పంచాయతి పేరును రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగిందన్నారు.థీమ్ ల వారిగా 461గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై కేంద్రప్రభుత్వఆన్‌లైన్‌ పోర్టల్ద్వారా వివరాలు పంపించగా ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామ పంచాయతీలకుపండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పేరిట పురస్కారాలు, ప్రశంసాపత్రాలను అందించడం జరిగిందన్నారు.

జిల్లాలోని 20 మండలాల్లోని గ్రామ పంచాయతీలు థీమ్ ల వారిగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు అంటే మొత్తం27 గ్రామపంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు వరించినవి. బిజినేపల్లి మండలంలోని అత్యధికంగా 5 గ్రామ పంచాయతీలు అవార్డులు సొంతం చేసుకుందని ప్రశంసించారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు