Home /News /telangana /

NAGAR KURNOOL NAGARKURNOOL MUNICIPAL OFFICIALS ACTIONS FOOTPATH TRADERS LOST THEIR JOBS SNR NNK BRV

Nagarkurnool: ఫుట్‌పాత్ వ్యాపారులపై మీ ప్రతాపమా .. మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం

(ఇదెక్కడి

(ఇదెక్కడి న్యాయం)

Nagarkurnool: పట్టణ ప్రగతి ఏర్పాట్ల పేరుతో మున్సిపల్ అధికారులు చేసిన హడావుడి వాళ్ల పొట్టకొట్టినట్లైంది. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో ఫుట్‌పాత్‌పై షాపులను తొలగించడంతో చిరువ్యాపారులు రోడ్డున పడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారని ఆందోళన చేపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagarkurnool)
    నాగర్‌కర్నూల్(Nagarkurnool)పట్టణ మునిసిపల్ అధికారులు(Municipal officials)అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుస్తులపై జులుం విదిలించారు. మునిసిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ధాక్షిణ్యంగా తమ దుకాణాలను తొలగించారని బాధిత వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన దుకాణాల తొలగింపుపై గత రెండు రోజులుగా వీధి వ్యాపారులతో కలిసి వివిధ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్(Busstand)వద్ద నల్లవెల్లి రోడ్డులో గల చిన్న డబ్బాలను, తోపుడు బండ్లను మునిసిపల్ సిబ్బంది పూర్తిగా తొలగించారు.

    పట్టణ ప్రగతి అంటూ అధికారుల బుకాయింపు:
    వీధుల్లో దుకాణాల తొలగింపుపై వీధి వ్యాపారాలు అధికారులను ప్రశ్నించగా.. పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో నగరాన్ని సుందరీకరణ చేసేందుకు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించామని\" మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆక్రమణల తొలగింపు పేరుతో దుకాణాలను అధికారులు తొలగించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడడంపై వ్యాపారాలు నిరసనకు దిగారు. స్థానిక నాయకులు వ్యాపారులకు మద్దతు తెలుపుతూ ఆందోళనకు దిగారు. నష్టపోయిన చిరు వ్యాపారులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దాదాపుగా వందకు పైగా నా చిరు వ్యాపారులను తొలగించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.



    మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారుల అత్యుత్సాహం:
    మరోవైపు జూన్ 18న రాష్ట్ర మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అయితే మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనే స్థానిక మునిసిపల్ అధికారులు వీధి దుకాణాలను తొలగించారనే వార్త ప్రచారంలో ఉంది. కేటీఆర్ ఒకరోజు పర్యటన కోసం తమ జీవితాలను రోడ్డుపాలు చేస్తారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంపై స్థానిక మునిసిపల్ అధికారులు స్పందిస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమం నేపథ్యంలోనే వ్యాపారాలను తొలగించామని చెప్తున్నారు. నగరంలో సుందరీకరణ పనులు చేపట్టే క్రమంలో డబ్బాలను, తోపుడు బండ్లను తొలగించాల్సి వచ్చిందని వివరించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలువకుండా ఉండేందుకు, నగరంలో మురుగునీటి సరఫరా కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే అధికారుల చర్యతో వీధిన పడ్డ చిరు వ్యాపారులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    ఇది చదవండి: ఆ పెద్దాయనకు భార్య అంటే ఎంతో ఇష్టం .. అందుకే ఆ పని చేశాడు



    ఇదెక్కడి న్యాయం..
    అధికారుల అత్యుత్సాహం కారణంగా పదుల సంఖ్యలో ఫుట్‌పాత్ వ్యాపారులకు జీవనోపాధి కోల్పోంది. ఫలితంగా తమపై ఆధారపడిన కుటుంబాల పోషణభారంగా మారిందని బాధిత వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Nagar kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు