Home /News /telangana /

NAGAR KURNOOL NAGARKURNOOL MEDICAL COLLEGE IS AVAILABLE THIS YEAR MBBS CLASSES ARE ALSO GOING TO START NNK BRV ABH

Nagarkurnool: అందుబాటులోకి వచ్చిన మెడికల్ కళాశాల: ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణకు ఇటీవల జాతీయ మెడికల్ కమిషన్ అనుమతులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచే ఈ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    N.Naveen kumar, News 18, Nagarkurnool

    Nagarkurnool; నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణకు ఇటీవల జాతీయ మెడికల్ కమిషన్ అనుమతులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచే ఈ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని కాళోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీ(kaloji narayana) అనుబంధంగా జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణ, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం విద్యా బోధన ప్రారంభం కానుంది.

    నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాలమైన తరగతులతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ(uyalwada)   సమీపంలో కేటాయించిన 23 ఎకరాల స్థలంలో కళాశాల భవనం పూర్తయింది. నేషనల్ మెడికల్ కమిషన్‌కు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్‌బి) సభ్యులు ఈ ఏడాది జూన్‌లో మెడికల్ కళాశాలను సందర్శించారు. కళాశాల భవనంతో పాటు మౌలిక సదుపాయాలు, లేబరేటరీ, లైబ్రరీ, హాస్టల్, జనరల్ ఆస్పత్రి భవనం, నర్సింగ్ స్టాఫ్, తదితర అంశాలను పరిశీలించారు. ఎన్ఎంసి సభ్యులు రిపోర్టు ప్రకారం 150 మంది విద్యార్థులతో అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సు తరగతులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలోని ప్రజలకు ఇది రీజనల్ ఆసుపత్రిగా సేవలు అందించనుంది.

    ఇప్పటివరకు ప్రసూతి ఎమర్జెన్సీ, జనరల్ ఓపి సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా జనరల్ ఆస్పత్రి మార్పుతో మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థోపెడిక్ (orthopedic), ఎమర్జెన్సీ(emergency), ట్రామా(trauma), క్రిటికల్ కేర్, ఆస్తమాలజీ(astrology), డెర్మటాలజీ(dermtology), డెంటిస్ట్(dentist), అనాటమీ(anatomy), జనరల్ సర్జరీ(surgery), న్యూరాలజీ(neurology), గైనకాలజీ(gynocology), ఎండోక్రనాలజీ(endocology), ఈఎన్ టీ, రెస్పీరటరీ, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాల్లో వైద్య నిపుణుల సేవలు లభించనున్నాయి. ప్రతి విభాగంలో నిష్ణాతులైన ప్రొఫెసర్ల, అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు నర్సింగ్ విద్యార్థుల సేవలు రోగులకు అందనున్నాయి.

    Read this also; Nagarkurnool: పొలానికి పిచికారీ చేసిన మందు దుష్ప్రబావంతో యువ రైతు మృతి



    జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 61 మంది వైద్య సిబ్బందితో పాటు మరో 34 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ సిబ్బంది తాత్కాలిక పద్దతిలో భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఇతర సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉండగా ఇప్పటికీ 20 మంది వరకు వీఆర్వోలకు విధులు కేటాయించారు. దీంతో వైద్య కళాశాల సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తారా లేక ఔట్సోర్సింగ్ పద్ధతిలో నెట్టుకొస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు