Home /News /telangana /

NAGAR KURNOOL NAGARKURNOOL HAS MORETHAN 1000 YEARS OF HISTORY SAYS NEWLY FOUND STATUTE ABH BRV NNK

Nagarkurnool: వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన నాగర్‌కర్నూల్, 15వ శతాబ్దం నాటి శాసనాలు గుర్తింపు 

15వ

15వ శతాబ్దం నాటి శాసనాలు గుర్తింపు - the landmarks of nagarkurnool were located of 15 th century

నాగర్‌కర్నూల్ కేంద్రంగా పూర్వం రాజ్యపాలన కూడా సాగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వారి వాదనలకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల కొన్ని పురాతన శాసనాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు తూము నిర్మాణ శాసనాన్ని గుర్తించారు

ఇంకా చదవండి ...
    (N.Naveen kumar, News 18, NagarKurnool)

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాల విభజన జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో నాగర్‌కర్నూల్ కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అయితే గతంలోనే నాగర్‌కర్నూల్ ప్రాంతం జిల్లాగా ఉండేదన్న వార్తలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ కేంద్రంగా పూర్వం రాజ్యపాలన కూడా సాగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వారి వాదనలకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల కొన్ని పురాతన శాసనాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు తూము నిర్మాణంకు సంబంధించి ఒక శాసనాన్ని గుర్తించడం జరిగింది. ఈ శాసనాన్ని 1587 నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈక్రమంలో స్థానికంగా కొందరు చరిత్రకారులు, సీనియర్ జర్నలిస్టులను సంప్రదించి నాగర్‌కర్నూల్ చరిత్ర గురించి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది

    1000 ఏళ్ల నాటి చారిత్రక ఆనవాలు:
    వెయ్యి ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన పశ్చిమ చాళుక్యులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభి నది పరివాహక ప్రాంతానికి వలసవచ్చారు. ఇక్కడ సారవంతమైన నేలలు ఉండటం, దుందుభి నది నీరు పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజ్య స్థాపన చేసుకుని శతాబ్దాల పాటు పాలించినట్టుగా చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. పశ్చిమ చాళుక్యల నుంచి నిజాం వరకు అనేక మంది రాజ వంశస్తులు ఇక్కడ పరిపాలన చేపట్టారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నాగర్‌కర్నూల్ ప్రాంతం 1904 వరకు జిల్లాగా ఉన్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ పట్టణంలో రైల్వే రవాణా లేని కారణంగా జిల్లా హోదాను కోల్పోవాల్సి వచ్చింది. ఆనాటి నిజాం పాలకులు నాగర్‌కర్నూల్ జిల్లాను మహబూబ్‌నగర్‌లో విలీనం చేసి పరిపాలన చేపట్టారు. ఆ తరువాత 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం నాగర్‌కర్నూల్ పట్టణాన్ని తిరిగి జిల్లాగా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అభివృద్ధిలో ముందంజలో ఉంటూ అన్ని రకాల సదుపాయాలను సమకూర్చుకుంటుంది.

    వెలుగులోకి వచ్చిన చెరువు తూము శాసనం:
    నాగర్‌కర్నూల్ చెరువు వద్ద నిర్లక్ష్యంగా పడిఉన్న తూము శాసనాన్ని ఇటీవల చరిత్రకారులు గుర్తించారు. ఆ రాతి శాసనాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మార్వో కార్యాలయానికి చేర్చి భద్రపరిచారు. ఈ శాసనం ప్రకారం కులీకుతుబ్ షా వంశానికి చెందిన మహమ్మద్ కులీకుతుబ్ షా 1565 నుంచి 1612 వరకు తెలంగాణ ప్రాంతంలో పరిపాలన కొనసాగించినట్లు తెలిసింది. ఆయన పాలనలోనే 1587 సంవత్సరంలో నాగర్ కర్నూల్ చెరువు తూమును నిర్మించి, అందుకు సంబంధించి రాతి శాసనాన్ని ఏర్పాటు చేశారు. శాసనంపై ఉన్న దేవనగరి లిపి ప్రకారం సర్వజిత్ నామ సంవత్సర శ్రావణమాసం బహుళ దశమి, శుక్రవారం నాడు అనగా క్రీ.శ. 1587సం. ఆగష్టు 28 శుక్రవారం నాడు ఈ శాసనం వేయబడింది. గోల్కొండ పాలకుడు సుల్తాన్ కులీకుతుబ్ పంపించగా పఖ్తారుఖాన్ కొడుకు మహాలుదార్ షేర్ మహమ్మద్ వచ్చి నాగర్‌‌కర్నూల్లో చెరువుకు తూము కట్టించాడని శాసనంలో చెప్పుకొచ్చారు.

    దాదాపుగా 1000 సంవత్సరాల పైగా ఉన్న చరిత్రను వెతికి తీసిన ఈ చారిత్రక ఆనవాలును మ్యూజియంలో భద్రపరచాలని జిల్లాకు చెందిన కవులు చరిత్రకారులు కోరుతున్నారు. ఇలాంటి శాసనాలు నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో చాలా ఉన్నాయని వాటిని గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా కొల్లాపూర్ అచ్చంపేట నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి చారిత్రక ఆనవాలు ఎన్నో ఉన్నాయని వాటిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు సూచిస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: History, Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు