Home /News /telangana /

NAGAR KURNOOL NAGARKURNOOL DISTRICT RESIDENT WHO HAS GOT A GOVERNMENT JOB WITH CULTURAL ART LIKE PITTALA DORA SNR NNK BRV

Nagarkurnool: ఆ వేషం వేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాడు .. పిట్టలదొరా మజాకా

(పిట్టలదొర

(పిట్టలదొర మజాకా)

Nagarkurnool: ఈ పాత్ర రంగంస్థలం పైకి వచ్చిందంటే చాలు ప్రేక్షుకుల్లో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ముఖ్యంగా చిన్నారులను ఈ పిట్టలదొర వేషగాడు ఎంతగానో ఆకర్శిస్తాడు. తన చేష్టలతో, కొంటే పనులతో అందరిని నవ్విస్తూ ఉంటారు. ఆ కళతోనే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాడు ఓ యువకుడు.

ఇంకా చదవండి ...
  (N.Naveen Kumar,News18,Nagarkurnool)
  పిట్టలదొర వేషధారణ..కొన్నేళ్ల క్రితం వరకు అందరికి తెలిసిన ఈ వేషధారణ, నేటి తరానికి పెద్దగా పరిచయం లేని పాత్ర. జంధ్యాల(Jandhyala)సినిమాల్లో కూడా మనం ఈ పిట్టలదొర (Pittala dora)పాత్రను చూస్తూ ఉంటాం. సంచార జీవులుగా ఉండే వీరు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి, వెరైటీ వేషధారణతో గలగలా మాట్లాడేస్తూ హడావిడి చేస్తూ…మనకు హస్యాన్ని అందిస్తుంటారు. వీధి నాటాకాలు వేసే వారి బృందంలో పిట్టల దొర వేషం కచ్చితంగా ఉంటుంది…హస్యాన్ని పలికించే ఈ పాత్ర లేకపోతే ఎలా?. ఆ పాత్ర పెట్టే గిలిగింతలకు కడుపుబ్బా నవ్వుకుంటాం..ఇప్పుడాపాత్రకు ప్రాణం పోస్తూ ఓ కళాకారుడు ప్రభుత్వ ఉద్యోగం(Government job) సాధించాడు నాగర్‌కర్నూల్ (Nagarkurnool)జిల్లాకు చెందిన బుద్దుల భాస్కర్(Buddul Bhaskar)అదెలాగంటే..?

  పిట్టలదొర వస్తే నవ్వులే నవ్వులు..!
  ఈ పాత్ర రంగంస్థలం పైకి వచ్చిందంటే చాలు, ప్రేక్షుకుల్లో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ముఖ్యంగా చిన్నారులను ఈ పిట్టలదొర వేషగాడు ఎంతగానో ఆకర్శిస్తాడు. తన చేష్టలతో, కొంటే పనులతో అందరిని నవ్విస్తూ ఉంటారు. పిట్టల దొర మన కళ్లముందు ఉన్నంతసేపు చూపుతిప్పుకోకుండా అతని ప్రదర్శనను తిలకిస్తూనే ఉంటాము. గతంలో గ్రామాల్లో ఎక్కవగా వీధి నాటకాల్లో కనిపించే ఈ పిట్టలదొర పాత్ర క్రమక్రమంగా అంతరించి పోయింది.అసలు ఈ రోజుల్లో పిట్టలదొర వేషాలు వేసే కళాకారులు ఉన్నారా, లేదా? అనే సందేహం కలగకమానదు. ఇలాంటి అరుదైన కళకు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన బుద్దుల భాస్కర్ జీవం పోస్తున్నారు.

  ఇది చదవండి: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా అడవికి దగ్గరగా.. ఆధునిక ప్రపంచానికి దూరంగానే వారి జీవనం..  పిట్టలదొర పాత్రకు ప్రాణం పోస్తున్న భాస్కర్:
  బుద్దుల భాస్కర్..... ఇతను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియెజకవర్గంలోని బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన కళాకారుడు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఆసక్తి ఉన్న భాస్కర్‌ను పిట్టలదొర వేషధారణ ఎంతోగానే ఆకర్షించింది. నలుగురిని నవ్వించేందుకు పిట్టల దొరనుమించిన పాత్ర లేదని భాస్కర్‌‌కు అర్ధమైంది.తన చిన్నతనంలో గ్రామాల్లో భిక్షాటకు వచ్చే పగటి వేషగాళ్ల దగ్గర ఈ పిట్టలదొర కళారూపాన్ని చూసి అవపోషణ పట్టాడు. ఆ పాత్రను తాను పోషించాలని అనుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ప్రభుత్వ సహకారంతో మహాలక్ష్మి కళాజాతాలో చేరి కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభుత్వం తరుపున శిక్షణ తీసుకుంటున్న సమయంలో కర్నూలుకు చెందిన పిట్టలదొర కళా డైరెక్టర్ ఉస్మాన్ దగ్గర శిష్యరికం చేసి పిట్టలదొర కళారూపాన్ని నేర్చుకున్నాడు భాస్కర్. అప్పటి నుంచి ఎక్కడ వీధి నాటకాలు జరిగినా అక్కడ భాస్కర్‌ పిట్టలదొరలో ప్రత్యక్షమయ్యేవాడు. తన పిట్టల దొర వేషధారణతో ఎంతగానో ఆకట్టుకునేవారు.

  ఇది చదవండి : జాతకాలు చెప్పుకునే వాడిని అమ్మాయి పేరు అడ్డుపెట్టుకొని చంపారు .. హత్య వెనుక పెద్ద కథే ఉందా  తెలంగాణ ఉద్యమంలోనూ పిట్టలదొర పోరాటం:
  మలిదశ తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో…. బుద్దుల భాస్కర్ పిట్టలదొర వేషాధారణతో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమం వైపు ప్రజలను ఆకర్శించేందుకు హస్యం పలికించే తన కళతో ఆలోచింపజేసేలా ప్రదర్శనలు చేసేవారు. ఎక్కడ ఉద్యమ కార్యక్రమాలు జరిగినా అక్కడకు వెళ్లి పిట్టలదొర వేషం వేసి అందరిలో తెలంగాణ ఉద్యమ స్పూర్తి నింపేవారు.

  సంస్కృతిక కళాజాతాలో ప్రభుత్వ ఉద్యోగం:
  తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత భాస్కర్‌ను ప్రభుత్వం గుర్తించి.. సంస్కృతిక కళాజాతాలో ప్రభుత్వ ఉద్యోగిగా అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 505 మంది కళాకారులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా… ఇందులో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బుద్దుల భాస్కర్‌కు అవకాశం లభించింది.

  ఇది చదవండి: కార్పొరేట్​ హాస్పిటల్​ను తలదన్నేలా ఆ ప్రభుత్వ ఆసుపత్రి.. ఒక్కసారిగా పెరిగిన సహజ కాన్పులు  చివరి శ్వాస వరకు ఇదే కళ ప్రదర్శిస్తా: భాస్కర్‌
  ఈ కళ ద్వారానే తనకు జీవానాధారం లభించిందని, కళను నమ్ముకొనే తాను జీవిస్తున్నాని భాస్కర్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు కళను ప్రదర్శిస్తూనే ఉంటానని తెలిపారు.
  బుద్దుల భాస్కర్ ఫోన్: 94901 47205
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Nagar kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు