హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dalit Bandhu : నిన్న పనోడు.. నేడు ఓనరు : 'దళిత బంధు' పథకం తెచ్చిన మార్పు ఇదే!

Dalit Bandhu : నిన్న పనోడు.. నేడు ఓనరు : 'దళిత బంధు' పథకం తెచ్చిన మార్పు ఇదే!

X
నచ్చిన

నచ్చిన వ్యాపారం ఎంచుకున్న లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు అందజేత

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ. 10 లక్షలు అందించి, వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిని సమకూరుస్తుంది ప్రభుత్వం.

ఇంకా చదవండి ...

NagarKurnool : దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ. 10 లక్షలు అందించి, వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిని సమకూరుస్తోంది ప్రభుత్వం. ప్రతి దళిత కుటుంబం కూడా పేదరికం నుంచి బయట పడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దళిత బంధు పథకం అమలు కావడంతో అనేక మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు కూలీలుగా, డ్రైవర్లుగా, నెల జీతానికి పనిచేస్తున్నవారు.. నేడు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ యజమానులుగా మారారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దళిత బంధు పథకం ఎంతో ప్రణాళిక బద్ధంగా అమలు కాగా, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఏమిటీ 'దళిత బంధు' పథకం?:

దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలు సొంతంగా వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు మంజూరు చేసి వారి వ్యాపారానికి పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం. దీంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 యూనిట్ల దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది. నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు 400 యూనిట్లు మంజూరు అయ్యాయి. వీటిని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు విడతల వారీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలు దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఎంచుకున్న వ్యాపార సముదాయాలను అందజేశారు.

నచ్చిన వ్యాపారాలు ఎంచుకుంటున్న లబ్ధిదారులు;

దళితబంధు పథకానికి అర్హులైన చాలామంది ట్రావెల్స్, ట్యాక్సీ వాహనాలను, ట్రాక్టర్లను, హార్వెస్టర్లను ఎంచుకొంటుండగా కొంత మంది వినూత్నంగా బట్టల దుకాణాలను, కోళ్ల పౌల్ట్రీను, ఇటుక బట్టీలను వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. లబ్ధిదారులకు ఏ వ్యాపారంలో అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో వినూత్నంగా ఆలోచించి వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓనర్‌గా మారిన డ్రైవర్ మధు:

ఇటీవల నాగర్‌కర్నూల్ మండలం బొందలగ్రామంలో 8 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం ద్వారా నిధులు అందాయి. వీరిలో ఒకరైన మధు అనే వ్యక్తి తన అనుభవాన్ని న్యూస్18 తో పంచుకున్నారు. గతంలో డ్రైవర్‌గా ఉంటూ రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు వచ్చేవని, తన జీవితంలో రూ. పది లక్షలు పెట్టుబడి పెట్టి, ట్యాక్సీ వాహనాన్ని కొనుగోలు చేస్తానని కలలో కూడా ఊహించలేదని మధు సంతోషం వ్యక్తం చేశారు. నిన్నటివరకు రోజువారి కూలిగా నెల జీతానికి పని చేసిన తాను నేడు ఓనర్‌గా సొంత వాహనాన్ని నడిపిస్తున్నాని గర్వంగా చెప్పుకున్నాడు. ఆత్మగౌరవంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం సహాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని మధు తెలిపారు. తనలాగే చాలా మంది దళిత యువకులకు ఈ పథకం అమలు కావడంతో వాళ్ల జీవితాల్లో పూర్తిగా మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.

First published:

Tags: Dalitha Bandhu, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు