హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: శబరిమలకి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

Nagar Kurnool: శబరిమలకి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

X
rtc

rtc

ఈ సూపర్ లగ్జరీ బస్సులో సిసి ఫుటేజ్ కెమెరాలు, సెన్సార్ సిస్టం, బస్ ట్రాకింగ్ సిస్టం, వీడియో ఆడియో సిస్టంలను ఏర్పాటు చేశారు. యాత్రలకు వెళ్ళేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

  • Local News Desk
  • Last Updated :
  • Nagarkurnool, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు ఆధునిక కొత్త బస్సులుజిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నూతన లగ్జరీ బస్సులను మొదటగా శబరిమల వెళ్లే భక్తులకు సేవలు అందించేందుకు వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో 6 ట్రిప్పులు శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు బుక్ చేసుకున్నారు.ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేయగా.. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడిన ఈ సూపర్ లగ్జరీ బస్సులో సిసి ఫుటేజ్ కెమెరాలు, సెన్సార్ సిస్టం, బస్ ట్రాకింగ్ సిస్టం, వీడియో ఆడియో సిస్టంలను ఏర్పాటు చేశారు. యాత్రలకు వెళ్ళేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

Read This : Karimnagar: ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కరీంనగర్ లో కలకలం రేపుతున్న అంతుచిక్కని వ్యాధి

వీటిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు. మొత్తంగా నాగర్ కర్నూల్ నుంచి ఆరు బృందాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఈ బస్సులను బుక్ చేసుకొని శబరిమల యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకు అన్ని విధాల చెరువులో ఉండి సేవలను అందజేసేందుకు ఆర్టిసి ఈ తరహా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆర్టీసీ బస్సును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దూరప్రాంతాల ప్రయాణాలకు ఆర్టీసీ బస్సు భద్రత మరియు శ్రేయస్సుతోఉంటుందన్నారు. శబరిమలకి వెళ్లాల్సిన స్వాములు ఆర్టీసీ బస్సులను ఎంచుకోవడం ఉత్తమమన్నారు.

ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక డబ్బులు వస్తువులు చేస్తారని, ఆర్టీసీ బస్సుల ప్రయాణం డబ్బులు ఆదాతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఆర్టీసీని ప్రోత్సహించి సంస్థ లాభాల్లో ఉండేలా కృషి చేయాలన్నారు.

First published:

Tags: Sabarimala

ఉత్తమ కథలు