(N.Naveen Kumar,News18,Nagar Kurnool)
బంక మట్టితో మ్యాజిక్ ల్యాంప్ తయారు చేస్తున్నాడు నాగర్ కర్నూల్(Nagar Kurnool) యువకుడు లోకేష్(Lokesh).అతను తయారు చేసిన దీపం కొత్తగా, వింతగా ఉంటుంది కాబట్టే మ్యాజిక్ ల్యాంప్ అనాల్సి వచ్చింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇలాంటి దీపం మనం ఇప్పటి వరకు చూడలేదు. అసలు ఇంత వెరైటీ దీపం ఎలా పుట్టిందంటే కేంద్ర ప్రభుత్వం ఖాధీ పథకం Khadi schemeద్వారా కుమ్మరి వృత్తి చేసే యువతకు ప్రత్యేక శిక్షణలు అందించింది. ఎండబెడ్ల వార్డు(Endabedla ward)లో కుమ్మరి వృత్తిపై ఆధారపడిన వారందరికీ మట్టితో ఎన్నో రకాల కళాకృతులు చేయవచ్చని ఆ శిక్షణ(Training)లో నేర్పారు. అందులో ఒకటే బంక మట్టిClayతో రకరాకల కుండలు, వాటర్ ఫిల్టర్లు(Water filters), మ్యాజిక్ ల్యాంప్(Magic Lamp)ల తయారీ విధానాన్ని నేర్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎండబెట్లకు చెందిన లోకేష్ ఈ పథకం ద్వారా శిక్షణ తీసుకున్నాడు. వీటన్నింటిలో మ్యాజిక్ ల్యాంప్ నిర్మాణం అది పనిచేసే విధానం లోకేష్‌ని ఆకట్టుకుంటుంది. ల్యాంప్ తయారు చేసే విధానం దగ్గర నుంచి వినియోగించే విధానం వరకు అంతా కొత్తగా అనిపించడంతో లోకేష్ అలాంటి వాటిని రూపొందించే పనిలో పడ్డాడు. ఈ మ్యాజిక్ ల్యాంప్‌ను తలక్రిందులుగా పెట్టి..ఆ రంధ్రంలో నూనె పోయాలి. నూనె (Oil)పోసిన తర్వాత యధావిదిగా పెడితే నూనె పోకుండా ఓ ట్రిక్‌ని ఉపయోగించాడు. దాంతోనే ఈ ల్యాంప్ కొత్తగా అనిపిస్తుంది.
మ్యాజిక్ ల్యాంప్ ప్రత్యేకత..
చిన్న కుండ ఆకారంలో ఉండే మ్యాజిక్ ల్యాంప్ కు రెండు రంద్రాలు ఉంటాయి. ఒకటి దీపం మద్యభాగంలో దీపం ఒత్తి పెట్టేందుకు ఒక రంద్రం, దీపం కింద బాగంలో నూనె పోసేందుకు ఒక రంద్రం ఉంటుంది. వీటిలో కింద బాగంలో ఉండే రంద్రం ద్వారా నూనె పోయాలి. దీని కోసం దీపాన్ని తలక్రిందులుగా పెట్టి నూనె పోయాలి. ఆ తర్వాత దాన్ని యథావిథిగా నిటారుగా పెట్టి…మధ్య రంధ్రంలో ఒత్తిని పెట్టి దీపం వెలిగించాలి. మళ్లీ నిటారుగునా నిలబెట్టినా …నూనె తిరిగి కిందకు కారకుండా ఉంటుంది. ఇదే ఈ మ్యాజిక్ ల్యాంప్ ప్రత్యేకత. ఇలా నూనె కిందకు కారకుండా ఉండేందుకు చిన్న ట్రిక్ ద్వారా ఈ ల్యాంప్ ను తయారు చేశారు. ఈ మ్యాజిక్ ల్యాంప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఆకట్టుకుంటోంది. చాలా మంది వెతుక్కుంటూ వచ్చి మరి ఆ ల్యాంప్‌లు కొనుక్కోని వెళ్తున్నారంటున్నాడు లోకేష్.
ఒక సారి వెలిగిస్తే 3 రోజుల పాటు వెలుగుతుంది..
మ్యాజిక్ ల్యాంప్ లో ఒకే సారి పావు లీటరు వరకు నూనెను నిల్వ ఉంచవచ్చు. పొడగాటి దీపం ఒత్తిని మధ్యభాగంలో ఉంచి వెలిగించాలి. ఒక సారి ఈ దీపాన్ని వెలిగిస్తే 3 రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది. దేవుడి సన్నిధిలో, అఖండ దీపం పెట్టేటప్పుడు ఈ దీపాన్ని వెలింగించవచ్చు. ఈ దీపం ధర కేవలం రూ.100. లోకేష్ తయారు చేస్తున్న ఈ మ్యాజిక్ ల్యాంప్‌కి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఎప్పుడూ ఫ్లాస్టిక్ దీపాలు, కరెంట్ దీపాలు వాడుతుంటారు కదా…ఒక్కసారి మీరు కూడా ఈ మ్యాజిక్ దీపం ట్రై చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nagarkarnol district, VIRAL NEWS