హోమ్ /వార్తలు /తెలంగాణ /

సామూహిక వివాహాలకు ఏర్పాట్లు పూర్తి.. మూడు రోజుల్లో ముహూర్తం..

సామూహిక వివాహాలకు ఏర్పాట్లు పూర్తి.. మూడు రోజుల్లో ముహూర్తం..

X
సామూహిక

సామూహిక వివాహాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

Nagar Kurnool: సాధారణంగా సామూహిక వివాహాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, యాదాద్రి భువనగిరి లాంటి ఆలయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

సాధారణంగా సామూహిక వివాహాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి , శ్రీశైలం, అన్నవరం, యాదాద్రి భువనగిరి లాంటి ఆలయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సామూహిక వివాహాలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్నాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్థాపించినటువంటి ఏంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించే ఈ సామూహిక వివాహాలకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ పాఠశాల ఆవరణం వేదిక కానుంది. 225 మంది జంటలు ఈ సామూహిక వివాహాల్లో ఒకటి కానున్నాయి. ఇందుకోసం ట్రస్ట్ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సుమారు 900 ఫీట్ల పొడవు గల పెళ్లి పందిరి స్టేజిని ఏర్పాటు చేశారు ఈ పెళ్లి పందిరి స్టేజీలో ఒక్కొక్క పెళ్లిపందిరి ఆవరణలో పెళ్లికూతురు పెళ్లి కుమారుడు వీరితోపాటు 8 మంది కూర్చొని వివాహం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి పట్టారు. వీటితో పాటు వివాహాలను తిలకించేందుకు వచ్చే బంధుమిత్రులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు భారీగా టెంట్లను వేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎండ వేడిమిని తట్టుకునే విధంగా ఈ టెంట్ల నిర్మాణం చేపట్టారు.

ఇది చదవండి: రోడ్డుపక్కనే ట్రైన్.. అక్కడికి వెళ్తే అన్నీ ఘుమఘుమలే..!

వీటితోపాటు వివాహాలకు హాజరైన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు కల్పించేందుకు లహరి గార్డెన్లో అద్భుతమైన విందులు ఏర్పాటు చేశారు. వివాహం జరిగిన అనంతరం పెళ్లికూతురు పెళ్ళి కొడుకులు కొత్త కాపురం పెట్టుకునేందుకు కావలసిన సామాగ్రిని డబుల్ కాట్ మంచం, బీరువాలు, కుర్చీలు, వంట సామాగ్రి అన్ని కూడా ట్రస్టు నిర్వాహకులు అందజేయనున్నారు.

ఇప్పటికే పెళ్లి కుమారుడు పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు కావలసినటువంటి పట్టు బట్టలను కూడా సమర్పించారు. ఈ వివాహ మహోత్సవాలకు నియోజకవర్గం మొత్తం కూడా ఆహ్వాన పత్రికలను ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు అందజేశారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు