హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: మత్తులో యువత..రోజుకో మహిళపై దాడి

Nagar Kurnool: మత్తులో యువత..రోజుకో మహిళపై దాడి

rape

rape

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలు, బాలికలపై మద్యం మత్తులో కామాంధులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్నారు. ఇంటా, బయటమహిళలకు నానాటికి రక్షణ కరువుతుంది. పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

(N.Naveen Kumar,News18,Nagarkurnool)

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలు, బాలికలపై మద్యం మత్తులో కామాంధులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్నారు. ఇంటా, బయటమహిళలకు నానాటికి రక్షణ కరువుతుంది. పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మహిళలపై పలు రకాల ఆకృత్యాలు పరిశీలిస్తే ప్రతి నెల సగటున 30 చొప్పున అంటే రోజూ ఒక మహిళలపై దాడి కేసులు నమోదవుతున్నాయి.

అధికారులు వివరణ చూస్తే అత్యాచారాలు, ప్రేమల పేరిట వేధింపులు వంటి ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో బాధితులు బయటికి రాకపోవడంతో సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఇలాంటి ఘటనలతో కుటుంబీకులు మానసిక ఒత్తిడితో కుమిలిపోతున్నారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోవడమే ఇలాంటి నేరాలకు కారణమని మానసిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. మద్యం మత్తులో దారుణాలు జరిగిన సంఘటనలు ప్రతి రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెరిగిపోయాయి. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 230 పైగా మద్యం దుకాణాలు ఉండగా ఒక్కోదుకాణానికి సగటున 50 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు.

మరికొందరు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటలల్లో కిరణా దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు సాగిస్తున్నారు. దుకాణాల్లోఎంఆర్పి రేట్ కి మద్యం అమ్ముతున్న వ్యాపారులు బెల్టులతో అక్రమ సంపాదనకు తెర లేపుతున్నారు. ప్రతిరోజు మద్యం దుకాణంతో సమానంగా బెల్ట్ షాపుల్లో వ్యాపారం సాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో బెల్ట్ దుకాణాల ద్వారా నిత్యం కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఇదే పనిగా వ్యాపారం సాగుతున్నారు. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకొని రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వాటిని వైన్స్ లో కాకుండా బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నారు. ప్రతినెల పల్లెలో మద్యం అందుబాటులో ఉండడంతో టీనేజ్ దగ్గర నుంచి మధ్య వయసుల వారి వరకు అందరూ సాయంత్రం అయితే చాలు బెల్ట్ షాపులకు చేరుకుంటున్నారు. ఇలా మద్యం తాగి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాస్త చనువుగా ఉన్న పాపానికి బాలికలు, యువతలపై కొందరు పోకిరీలు తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడి వాయిస్ రికార్డు, వీడియో కాల్స్ రికార్డ్ చేసి వాటి ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే వీటికి మద్యం మత్తు బానిసగా మారి జులాయితిరిగే వారే ఇలాంటి ఘటనలు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహమదాబాద్ మండలం కంచనపల్లిలో జూలైలో ఆస్తి ఇవ్వలేదని కొడుకు బందరయ్య కన్న తల్లిని మద్యం మత్తులో బండ రాయితో మోదీ హత్య చేశాడు.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో పాతపల్లికి చెందిన బయ్యా రాజశేఖర్ సునీత దంపతులకు గీత అనే కూతురు ఉంది. ఈ బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయమై తండ్రి కూతురుని ఎన్నిసార్లు మందలించినా వినకపోవడంతో గ్రామంలో పరువు పోతుందని అక్టోబర్ 25న కూతురుని పదునైన ఆయుధంతో అతి కిరాతకంగా నరికివేశాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మూడేళ్లుగా మహిళలపై జరిగిన నేరాలను పరిశీలించగా మహబూబ్ నగర్ జిల్లాలో 2020 ఏడాదిలో 66, 2021లో 92 మహిళలపై దాడుల కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 2020లో 264 కేసులు, 2021లో 251 కేసులు, 2022లో 287 కేసులు నమోదయ్యాయి.

Rajanna Siricilla: పంచాయతీ ట్రాకర్ బహిరంగ వేలం.. వైరల్ అయిన సర్పంచ్ ప్రకటన..

జోగులాంబ గద్వాల జిల్లాలో 2020లో 8 కేసులు, 2021లో 6 కేసులు, 2022లో 15 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 2020లో 4 కేసులు, 2021లో 16 కేసులు, 2022లో 8 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో 2020లో 150 కేసులు, 2021లో 175 కేసులు,2022లో 146 కేసులు నమోదయ్యాయి. ఇక మద్యం దుకాణాల విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 90 మద్య దుకాణాలు ఉండగా 17 బార్లు ఉన్నాయి.

Bhadradri Kothagudem: ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వారి కోసం స్పెషల్ డ్రైవ్

వీటి పరిధిలో సుమారుగా 15000 బెల్ట్ షాపులు ఉన్నట్టు అంచనా. నాగర్ కర్నూల్ జిల్లాలో 67 మద్యం దుకాణాలు ఉండగా 6 బార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 8,000బెల్ట్ షాపులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 36 మద్యం దుకాణాలు, 7 బార్లు ఉండగా 4000 బెల్ట్ షాపులు, వనపర్తి జిల్లాలో 37మద్యందుకాణాలు, 8 బార్లు ఉండగా 3,000 బెల్ట్ షాపులు, నారాయణపేట జిల్లాలో 29 మద్యం దుకాణాలు, 6 బార్లు ఉండగా 1250 బెల్ట్ షాపులు ఉన్నట్టుగా అంచనా.

First published:

Tags: Local News, Nagar kurnool, Nagarkurnool, Telangana