హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: నన్ను డమ్మీ చేస్తున్నారు.. జెడ్పీ చైర్మన్ ఆవేదన

Nagar Kurnool: నన్ను డమ్మీ చేస్తున్నారు.. జెడ్పీ చైర్మన్ ఆవేదన

ఆవేదన చెందుతున్న జెడ్పీ చైర్మన్

ఆవేదన చెందుతున్న జెడ్పీ చైర్మన్

Telangana: వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా కౌంటర్ వేసేలా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో తనను డమ్మీ చేసే విధంగా రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా కౌంటర్ వేసేలా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో తనను డమ్మీ చేసే విధంగా రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్పర్సన్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వినియోగించుకోకుండా తమను చులకన చేసి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ కి సంబంధించినటువంటి నిధులను ఎలాంటి తీర్మానం లేకుండానే కలెక్టర్ ఖర్చు చేయడాన్నీ తప్పు పట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన తమను ఇలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకట్ట వేస్తున్నారని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ పదవి లేకుండా కాని సామాన్య పౌరుడిగా కూడా పోరాడగలరని చెప్పుకొచ్చారు.

వనపర్తి జిల్లా పరిషత్లోని నిధులను తీర్మానం లేకుండానే అభివృద్ధి పనులకు ఎలా కేటాయిస్తారని జడ్పీ చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి ప్రశ్నించారు. తమలను డమ్మీ చేయాలని చూస్తున్నారని పదవి పోయినా సరే సామాన్యుల పోరాడుతానని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సర్ది చెప్పిన వినలేదు. లోకేనాథ్ రెడ్డి అధ్యక్షతన వనపర్తి జిల్లా జడ్పీ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కలెక్టర్ యాస్మిన్ భాష జడ్పి సీఈఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ పై మండిపడ్డారు. వైద్యారోగశాఖలోని సబ్ సెంటర్లలో సౌకర్యాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 84 లక్షల రూపాయలు తీర్మానం లేకుండానే కేటాయించడంపై మండిపడ్డారు. అలాగే జిల్లాలోని స్కూళ్లలో సౌకర్యం కోసం వచ్చిన రెండు కోట్ల నిధులను స్థానిక జడ్పిటిసి ఎంపిటిసి లకు చెప్పకుండానే ఆయా స్కూళ్లకు ఎలా కేటాయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఖాతాలోని నిధులను తమ తీర్మానం లేకుండా కలెక్టర్ అకౌంట్ కు ఎలా మళ్ళిస్తారని ప్రశ్నించారు. జిల్లా జడ్పిటిసి ఎంపీటీసీలకు విలువ లేకుండా పోయిందని ప్రజలు ఓటేసి నాలుగేళ్లు గడుస్తున్న ఒక పని కూడా సొంతంగా చేయలేని దుస్థితిలో ఉన్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వాపోయారు.

తమను అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని మండలం పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానం ఉండడం లేదని ఆయన అక్కడికక్కడ వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నట్లుగా వివరించారు. తనపై కొందరు జడ్పిటిసిలు ఎంపీపీలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని పరోక్షంగా మంత్రి నిరంజన్ రెడ్డి పై కౌంటర్లు వేశారు. ఈ చర్చ సాగుతున్నంగానే మంత్రి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మట్టి దినోత్సవాల పాల్గొనడానికి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మంత్రితోపాటుగా కొందరు జెడ్పిటిసిలు ఎంపీపీలు కూడా వెళ్లిపోయారు.దీంతో లోక్నాథ్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. కావాలనే తనకు విలువ లేకుండా చేస్తున్నారని సన్నిహితులతో చెప్పుకున్నట్లు తెలిసింది.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు