N.Naveen Kumar,News18,Nagarkurnool
రైతులకు కూలీల కొరతను నివారించడానికి, తక్కువ సమయంలో పంట పనులను చేపట్టేందుకు వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన శాఖ కేంద్రం సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వరి పంటలో డ్రమ్ సీడ్ విధానాన్ని రైతులు వినియోగించేలా చర్యలు చేపట్టారు.డ్రమ్స్ సీడ్ వినియోగ విధానాన్ని పెంచి రైతులకు సమయాన్ని డబ్బును ఆదాచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఈ డ్రమ్ సీడ్ పద్ధతులను వివరించేందుకు, వాటిని రైతుల్లోకి చేరవేసేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ లు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటనలు చేపట్టారు. రీసెర్చ్ స్కాలర్స్టీఫెన్ డ్రం సీడ్ వినియోగ విధానాన్ని వివరిస్తున్నారు. ఈ విధానం చేపట్టడం వలన రైతులకు ఎంతో సులభంగా పంటను సాగు చేయొచ్చని సమయాన్ని ఆధా చేసుకోవచ్చని న్యూస్ 18 తో ప్రత్యేకంగా వివరించారు.
రైతులకు డ్రం సీడ్ యూనిట్లు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా అందులో నాగర్ కర్నూల్ జిల్లా కూడా ఉంది. జిల్లాలోని 20 మండలాల్లో మండలానికి రెండు గ్రామాలు చొప్పున ఎంపిక చేసి 40 గ్రామాల రైతులకు ఈ డ్రమ్ సీడ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిమెయింటెనెన్స్ విధానాన్ని ఏఈఓలకు సర్పంచ్ లకు అప్పగించారు.
విత్తనాలను నాటాలనుకున్న రైతులు రోజుకు 250 రూపాయల అద్దెను చెల్లించితీసుకు వెళ్ళవచ్చు.వినియోగ విధానాన్ని విత్తనాలను ఏ విధంగా నాటాలనే అంశాలను స్థానికంగా ఉండే ఏఈవోలు రైతులకు వివరిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏఈఓలకు డ్రం సీడ్ ఉపయోగ విధానాలపై అవగాహనలు కల్పించారు. ఏఈఓలకు డ్రం సీడ్ యూనిట్లను అందించి వాటి ద్వారా రైతులు సాగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana