N.Naveen Kumar,News18,Nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి జడ్పిటిసి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికైన బండారు పద్మ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమిత్ర గత మూడేళ్లుగా పోరాటం చేస్తూ సరైన ఆధారాలు సమర్పించడంతో హైకోర్టు తెలకపల్లి జడ్పిటిసి బండారు పద్మ ఎన్నిక చల్లదని తీర్పు వెలువరించింది.ఆమె స్థానంలో ఓడిపోయిన సుమిత్రకుజడ్పిటిసిగా అధికార బాధ్యతలు అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది.
Read Also : Rajanna Siricilla: సద్వాల్నా.. వద్దా సార్..! సిరిసిల్ల పిలగాండ్లకు పుస్తకాలే ఇయ్యలే
ఈ ఏడాది జులైనెలలోనే నాగర్ కర్నూల్ ఎలక్షన్ ట్రిబ్యునల్కోర్ట్ కూడా ఈ తరహా తీర్పును వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ జడ్పి ఛైర్పర్సన్ బండారు పద్మావతి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రత్యర్థులు అందించినటువంటి ఆధారాలను క్షుణంగా పరిశీలించి కోర్టు కీలకమైన తీర్పులు వెలువరించింది.
కోర్ట్ తీర్పుతో పద్మావతి జెడ్పీ చైర్మన్ బాధ్యతల నుంచితప్పుకోగా వైస్ చైర్మన్గా ఉన్న బాలాజీ సింగ్ ఠాగూర్ కు ప్రభుత్వం జడ్పీ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ బాధ్యతలను బాలాజీ సింగ్ ఠాగూర్ నిర్వహిస్తున్నారు. న్యూస్ 18 ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూను చేపట్టింది.
ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారని అంశాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆదేశానుసారం తాను అదనపు బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. తాను ఎన్నాళ్లు ఈ పదవిలో ఉంటానో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు చేసేందుకు కృషి చేస్తారని వివరించారు.
జిల్లాలోని 2019లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో తెలకపల్లి టిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మావతి గెలుపొందారు. జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఎస్సి జనరల్ కావడంతో పద్మావతికి అవకాశం దక్కింది. అయితే ఎన్నికల అఫిడవిట్లో తప్పులు వివరాలు సమర్పించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల క్రిమినల్ ఆశ్రయించింది. పద్మావతి మొదటి కుమారుడు 1997లో ఇద్దరు కవలలు 2001లో జన్మించినట్లు పేర్కొంది.
అయితే 1991లోనే మొదటి కుమారుడు పుట్టగా 1997లో ఒకరు 2001లో మరొకరు జన్మించారని పద్మావతి తప్పుడు ఆధారాలు సమర్పించారని సుమిత్ర స్థానికకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పద్మావతి జడ్పిటిసి ఎన్నికచెల్లదనిస్థానిక కోర్టు గత జులైలో తీర్పు వెలువరించింది.రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రను జడ్పిటిసిగా ఎన్నికైనట్టు ప్రకటించాలని తీర్పులో పేర్కొంది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ పద్మావతిహైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విజించింది.ఆధారాలు పరిశీలించిన కోర్టు పద్మావతి ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana