రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
బిజినపల్లి మండల కేంద్రం నుండి బయలుదేరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి షైన్ పల్లి గ్రామంలో మార్కండేయ లిఫ్టు ప్రాజెక్టు పైలాన్ ను ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి కృష్ణా నది జలాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. మార్కండేయ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను ఆపడానికి కుట్ర పన్ని ఆ ప్రాజెక్ట్ కట్టే ప్రదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాగం జనార్దన్ రెడ్డి కాలు మోపి అపవిత్రం చేసిన సందర్భంగా 101 బిందెలకృష్ణా జలాలతో శుద్ధి చేశామని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిలపై ఎమ్మెల్యే మర్రి తీవ్రంగా మండిపడ్డారు.దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభకు వచ్చిన రేవంత్ రెడ్డి దళితుల గిరిజన ఆరాధ్య దైవం అయినఅంబేడ్కర్ విగ్రహంకు పూల మాల వేయకుండా అవమనాపరిచాడని ఆరోపించారు.
నాగం కాటేసే పాము లాంటి వాడని, తాను నీడను ఇచ్చే మర్రి చెట్టు లాంటి వాడిని కితాబిచుకున్నారు. ఈ సందర్భంగానాగం వేసిన సవాల్ స్వీకరిస్తానని చెప్పారు. ఆరు నెలల్లో ఈ మార్కండేయ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని, చేయకుంటే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని నాగం తరుపున ప్రచారం చేస్తా అని చెప్పుకొచ్చారు.రేవంత్ బాషను భరించ లేకసభ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వెళ్ళిపోయారుని ఎద్దేవా చేశారు.
తిట్టడానికి సభ పెట్టి అయిదు కోట్లు ఖర్చు చేశారన్నారు.ప్రభుత్వము నుండి వచ్చినవి కాకుండా సొంత పైసలు పెట్టి అభివృద్ధి చేసిన తనలాంటివాడు నిజమైన లీడర్ అవుతాడని అన్నారు. ఓటుకు నోటుకు దొరికిన రేవంత్ కు తనకుబిజినపల్లి చౌరస్తాలో రహస్య ఓటింగ్పెడుదామా అని సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana