హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: అధికారులు లేని మున్సిపాలిటీ కార్యాలయం.. ఉందంటే ఉంది.. అంతే..!

Nagar Kurnool: అధికారులు లేని మున్సిపాలిటీ కార్యాలయం.. ఉందంటే ఉంది.. అంతే..!

X
ఈ

ఈ ఆఫీసులో అధికారులు లేరు

Nagar Kurnool: గతంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులనుఎప్పటికప్పుడు పరిష్కరించిన మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కుమార్ బదిలీపై వెళ్లేలా కొంతమంది ప్రజాప్రతినిధులు మాటలంటూ అవమానపరిచే విధంగా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Hyderabad

రిపోర్టర్ :నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

నాగర్ కర్నూలు మున్సిపాలిటీ (Nagar kurnool Municipality) లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కార్యాలయంలో ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా సెలవులపై వెళ్తున్నారు. పని ఒత్తిడి పెరగడం, రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడంతోనే అధికారులందరూ సెలవుపై వెళ్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు లేక మున్సిపాలిటీలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సరిగ్గా పని చేయడం లేదంటూ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పరుష పదజాలంతో అధికారులపై మండిపడటంజీర్ణించుకోలేక చాలామంది అధికారులు అనారోగ్య సమస్యల పేరుతో సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు. దీంతో కింది స్థాయికి ఇబ్బంది తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో పనులనుపట్టించుకోవడంలేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

 బీఆర్ఎస్‌ రెండో బహిరంగసభకు సర్వం సిద్ధం .. గులాబీ మయంగా మారిన నాందేడ్‌

గతంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులనుఎప్పటికప్పుడు పరిష్కరించిన మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కుమార్ బదిలీపై వెళ్లేలా కొంతమంది ప్రజాప్రతినిధులు మాటలంటూ అవమానపరిచే విధంగా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డిని తిరిగి ఇదే ప్రాంతానికి బదిలీ అయ్యేలా కొంతమంది ముఖ్య నేతలు తెరవెనుక చక్రం తిప్పినట్లు కూడా సమాచారం. కానీ ఇటీవల నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో స్థానిక ప్రజాప్రతినిధులు పర్యటనలు చేసి.. పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలను, అపరిశుభ్ర వాతావరణన్ని చూసి ప్రజల ముందే దురుసుగా దూషించడం వలన మనస్థాపానికి గురి అయినట్టుగా తెలుస్తుంది.

కొద్ది రోజుల కిందట ఓ అక్రమ వెంచర్ పర్మిషన్ విషయంలో మాట వినకపోవడంతో మరోసారి తీవ్ర పరుష పదజాలంతో దూషించారు.దీంతో మున్సిపల్ కమిషనర్ జయంత్ మెడికల్ లీవ్ తీసుకుని వెళ్లిపోయారు. ఆయనతో పాటు తోటి గిరిజన ఉద్యోగిని కూడా తీవ్ర పరుష పదజాలంతో దూషించడం సంబంధిత అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే తాను కూడా వెన్నుముక సమస్య ఉందంటూ మెడికల్ లీవ్లోకి వెళ్లడం చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ రేవంత్ కుమార్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్ ఇరువురు మెడికల్ లీవ్ లోనే ఉండగా, ఏఈ ప్రశాంత్ కూడా లీవ్ కొరకు దరఖాస్తు చేసుకోవడంతో మున్సిపల్ కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

గతంలో పనిచేసిన మేనేజర్ యాదయ్యకు తిరిగి మున్సిపల్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. అధిక ఒత్తిడి కారణంగానే సెలవులు పెడితే కార్యాలయంలో ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో ఒకసారిగా భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. అధికార పార్టీ కౌన్సిలర్లు ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ వెంచర్లు వేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇస్టారీతిగా పరిమితికి మించి అంతస్థుల నిర్మాణం చేపట్టడంతో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ సదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్న ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారు.దీంతో నిబంధనలకు విరుద్ధంగా తాను పనిచేయలేనని చెప్పడంతో ప్రజాప్రతినిధి వద్దకు పిలిచి చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు వెళ్లిన మరో గిరిజన అధికారికి సైతం అవమానం తప్పలేదు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ మాఫియా కబ్జా కోర్ల సంబంధాలు ఉన్న కౌన్సిలర్లకు మేలు చేసేందుకు సదరు ప్రజాప్రతినిధి అధికారులపై అక్కసు వెళ్ళగకుతున్నారని ఇతర అధికారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల ముఖ్య నేతల పర్యటనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి వసతి ఇతర సమస్యలు పరిష్కారానికి అధికారులు లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి లేకపోలేదు. దీంతో పాటు ఈనెల 12న ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. అందుకు పారిశుద్ధం లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలితో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు