హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎంపీ VS ఎమ్మెల్యే.. ఫ్లెక్సీల రచ్చ.. ఫోన్ కాల్ రికార్డ్ వైరల్!

ఎంపీ VS ఎమ్మెల్యే.. ఫ్లెక్సీల రచ్చ.. ఫోన్ కాల్ రికార్డ్ వైరల్!

నేతల మధ్య ఫ్లెక్సీ వార్..

నేతల మధ్య ఫ్లెక్సీ వార్..

Telangana: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాములుతో చర్చించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాములుతో చర్చించారు. ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్ ఫ్లెక్సీలు అచ్చంపేట నియోజకవర్గంలో కట్టేందుకు వీలులేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆక్షేపించారు. ఒక ఎంపీ కుమారుడిగా తమ అభిమానులు ఈ ఫ్లెక్సీలు కట్టి ఉండవచ్చని, ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందని ఎంపీ రాములు సమాధానం ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు, ఎంపీ పోతుగంటి రాములకు మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతుంది. జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా రాజుకున్న అగ్గి వీరు ఇరువురి మధ్య ఇప్పటికీ బగ్గు మంటూనే ఉంది. జడ్పీ చైర్పర్సన్ పదవి తమకు దక్కలేదన్న ఆవేదనతో ఎంపీ రాములు అతని కొడుకు భరత్ ఇద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తమ ప్రజాదరణ ఏమిటో చూపించుకుంటామని సవాల్ చేసిన ఎంపి రాములు, ఆయన కుమారుడు భరత్ అచ్చంపేట నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఎమ్మెల్యే బాలరాజుకు, ఎంపీ పోతుగంటి రాములకు మధ్య వివాదం మరోసారి చెలరేగింది. తన నియోజకవర్గంలో భరత్ ఫ్లెక్సీలు పెట్టేందుకు వీలులేదని ఎంపీ రాములకు నేరుగా ఫోన్ చేసిహెచ్చరించారు. అలా పెడితే తాము పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అచ్ఛంపేటనియోజకవర్గంలో కల్వకుర్తి జడ్పిటిసి అయిన భరత్ ఫ్లెక్సీలు ఎలా కడతారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాములను ప్రశ్నించారు. భరత్ నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేయడం పార్టీ నిబంధనలు ఉల్లంఘించడమని చెప్పారు.ఇలా ఫ్లెక్సీలు కట్టడం క్రమశిక్షణకు వ్యతిరేకమని, పార్టీని ధిక్కరించినట్లేనని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాములతో ఫోన్లో సంభాషించారు.

ఈ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. భరత్ ఫ్లెక్సీలను వెంటనే తీసివేయాలని ఎంపీ రాములుకు సూచించారు. అది కుదరదని భరత్ ఒక ఎంపీ కుమారుడని, తన అభిమానులు భరత్ ఫ్లెక్సీలు కట్టి ఉండవచ్చని తీయడం కుదరదని రాములు గువ్వలతోస్పష్టం చేశారు.ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందని ఫ్లెక్సీలు ఎవరైనా కట్టుకోవచ్చని చెప్పడంతో అలా ఉండదని గువ్వల హెచ్చరించారు.

ఎన్నికలు మరో ఏడు ఎనిమిది నెలల సమయం ఉన్న సందర్భంలో ఇలాంటి చర్యల వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తాను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఏ పోటీకి అయినా సిద్దమని గువ్వల తెలిపారు.అంతవరకు ఎలాంటి కాంట్రవర్సీలు తీసుకురావద్దని రాములు సూచించారు.ఈ విషయమై రాములు సమాధానమిస్తూ పార్టీ పెద్దలతో సంప్రదించిన తరువాతనే తాను మాట్లాడతారని గువ్వల బాలరాజుకు చెప్పారు.

First published:

Tags: BRS, CM KCR, Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు