హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking: సవతులుగా మారిన అక్కాచెల్లెళ్లు..! చిన్నగొడవతో ఎంతటి ఘోరం..?

Shocking: సవతులుగా మారిన అక్కాచెల్లెళ్లు..! చిన్నగొడవతో ఎంతటి ఘోరం..?

నారాయాణపేట జిల్లాలో దారుణం

నారాయాణపేట జిల్లాలో దారుణం

మెున్నటిదాకా వారిద్ధరు అక్కచెల్లెళ్లు.., నిన్నఒకే భర్తకు భార్యలు. నేడు సవతులు. ఈ సవతుల పోరులో కన్నబిడ్డను తానే పొట్టనపొట్టుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా (Narayanapeta District) కోస్గీ మండలంలో జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar | Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

మెున్నటిదాకా వారిద్ధరు అక్కచెల్లెళ్లు.., నిన్నఒకే భర్తకు భార్యలు. నేడు సవతులు. ఈ సవతుల పోరులో కన్నబిడ్డను తానే పొట్టనపొట్టుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా (Narayanapeta District) కోస్గీ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మెుగుళ్లమ్మ, కాశమ్మ సొంత అక్కచెల్లెలు.అయితే కాశమ్మ పుట్టకతోనే దివ్యాంగురాలు. దీంతో కుటుంబ సభ్యులు మెుగుళ్లమ్మకు కోసిగిలో మద్దూరు గోవింద్ తో వివాహం జరిపించారు. ఈ దంపతులిద్దరికి ఇధ్దరు పిల్లలు . చెల్లెలు దివ్యాంగురాలు కావటంతో పెళ్లికాలేదని.. జాలిపడిన మెుగుళ్లమ్మ.. తన భర్తతోనే చెల్లి కాశమ్మను ఇచ్చిపెళ్లిచేయించింది. ఇలా రోజులు గడుస్తుండగా కాశమ్మకు కొడుకు పుట్టాడు. ఇలా సంతోషంగా సాగిపోతున్న సంసారంలో అక్కచెల్లెళ్ల మధ్య సవతుల పోరు నడిచింది. దీంతో అక్క మెుగుళ్లమ్మ... కాశమ్మను దండించింది. దీంతో అక్కపై కోపం పెంచుకున్న కాశమ్మ... ఏం చేసిందో చూడండి.

దివ్యాంగురాలైన చెల్లిని చేరదీసి తన భర్తకు రెండో వివాహం చేసి జీవితమిచ్చిన అక్కపై కోపంతో కన్న బిడ్డను హత్య చేసింది. తప్పించుకునేందుకు చేసిన హైడ్రామా కథ బెడిసి కొట్టింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు స్థానికులు తెలిపిన కథనం ప్రకారం కోసిగిలోని ఎస్సీ కాలనీకి చెందిన మద్దూరు గోవింద్కు కర్ణాటక రాష్ట్రంలోని కానగడ్డకు చెందిన మొగుళ్ళమ్మతో వివాహం కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొగులమ్మ చెల్లెలు కాశమ్మ పుట్టుకతో మూగ చెవుడు కావడంతో తన చెల్లెలి జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తన భర్త గోవిందులతో రెండేళ్ల క్రితం వివాహం జరిపించింది. ఈమెకు ఒక కొడుకు పుట్టాడు. కుటుంబ విషయమై అక్క .. చెల్లెలునిమందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కాచెల్లెల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

దీంతో అక్కపై కోపం పెంచుకున్న కాశమ్మ శనివారం ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి బాబును తీసుకెళ్లి హత్య చేసి పట్టణ శివారులోని గుడి సమీపంలో ఉన్న నీళ్ల బావిలో పడేసింది. ఇంటికి వచ్చిన కాశమ్మ తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులకు సైగలు చేసింది. అయితే కొన్ని రోజులుగా దొంగలు తిరుగుతున్నారని పుకార్లు ఉండడంతో కాలనీ మొత్తం మేల్కొంది. యువకులు కాలనీలో గాలించి ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం చెప్పారు.

ఇది చదవండి: నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు.., నిధి దొరికిందా..? పురాతన ఆలయాల వద్ద ఏం జరుగుతుంది..?

పోలీసులు ఆదివారం ఉదయం కాలనికిచేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో అక్క చెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతుండడంతో బాబును కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట మొగులమ్మపై అనుమానం వచ్చినప్పటికీ పోలీసులు బాధ్యత కుటుంబ సభ్యులందరిని స్టేషన్కు తరలించారు. తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.

దివ్యంగురాలైన కాశమ్మ అక్కపై కోపంతో క్షణికావేశం బిడ్డను చంపి బావిలో వేసినట్లు ఒప్పుకుంది. బాబును వేసిన బావిని చూపడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వీడికి తీసి పోస్టుమార్టం చేయించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు