హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణి.. కానీ, అక్కడ అలా జరుగుతుందని ఊహించనేలేదే..

Nagarkurnool: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణి.. కానీ, అక్కడ అలా జరుగుతుందని ఊహించనేలేదే..

నాగర్​కర్నూల్​ ఆసుపత్రి

నాగర్​కర్నూల్​ ఆసుపత్రి

మొదటి కాన్పు కోసం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేసి సాధారణ ప్రసవం చేయడంతో ఆడపిల్ల జన్మించింది. కానీ, ఆ తర్వాత..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(N. Naveen kumar, News 18, Nagarkurnool)

ప్రసవానంతరం ఆసుపత్రిలో (Hospital) చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ (Nagarkurnool)జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్దముందునూరు గ్రామానికి చెందిన ఆప్షన్ బేగం (23) మొదటి కాన్పు కోసం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేసి సాధారణ ప్రసవం చేయడంతో ఆడపిల్ల జన్మించింది. కాన్పు సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యులు జనరల్ హాస్పిటల్‌ (General Hospital)కి తరలించారు. పరిస్థితి ఆందోళనగా ఉండగా మహబూబ్‌నగర్ (Mahbubnagar) రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆప్షన్ బేగం సోమవారం రాత్రి చనిపోయింది. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన తన భార్య మృతిచెందని మృతురాలి భర్త మోసిన్ ఆరోపిస్తూ మంగళవారం ఉదయం పెద్ద ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళనకు దిగాడు. వైద్య సిబ్బంది సర్ది చెప్పడంతో ఆందోళన విరమించాడు. ఘటనపై ఆసుపత్రి వైద్యుడు నారాయణస్వామిని వివరణ కోరగా అందుబాటులో ఉన్నహెడ్ నర్స్ సాధారణ ప్రసవం చేసిన సమయంలో అధిక రక్తస్రావం జరిగిందని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి;

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ అడవిలో బాలిక మృతదేహం లభ్యమయింది. మహబూబ్‌నగర్ మండలానికి చెందిన బాలిక మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మన్యంకొండ అటవీ సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రి తరలించారు. మృతురాలు సోమవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని స్నేహితులను ఇతర బంధువులను అడిగినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాము కాటుకు మహిళ మృతి:

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఎక్వపల్లి గ్రామంలో పాము కాటుకు గురై మహిళా మృతి చెందింది. వ్యవసాయ పనులుకు వెళ్లిన మహిళను పాము కాటు వేసింది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ కూలీ బత్తుల పెంటమ్మ (58) మంగళవారం గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్ళింది. పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కాలుకు రక్తం కారుతుండడంతో గమనించిన ఇతర కూలీలు వెంటనే బాదేపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు. పెంటమ్మకు ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి;

నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు డీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు తాడూరు మండలంలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన గోవిందు రంగయ్య (45) మంగళవారం నాగర్‌కర్నూల్ నుంచి తన గ్రామానికి వెళ్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ ఎదురుగా బైక్ పై వస్తుండగా ఇరువురు ప్రమాదవశాత్తు ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్‌కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

First published:

Tags: Government hospital, Local News, Nagarkurnool, Pregnant women

ఉత్తమ కథలు