Home /News /telangana /

NAGAR KURNOOL MOTHER DIED AFTER GIVING BIRTH TO BABY BABY ALSO DIED ABH BRV NNK

Nagarkurnool: ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అనంతరం తల్లీ బిడ్డ మృతి: ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన 

వైద్యుల నిర్లక్ష్యమే అంటూ బాధితుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యమే అంటూ బాధితుల ఆందోళన

కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి సరైన వైద్యం చేయకపోవడంతో తల్లి బిడ్డ మృతి చెందిందంటూ బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు మాత శిశు సంరక్షణ కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి సరైన వైద్యం చేయకపోవడంతో తల్లి బిడ్డ మృతి చెందిందంటూ బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు మాత శిశు సంరక్షణ కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంకు చెందిన మెట్లపల్లి ఆంజనేయులు భార్య.. భారతమ్మ మొదటి కాన్పు కోసం ఆగష్టు 4న వనపర్తిలోని ఎంసిహెచ్‌కు వచ్చింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు బీపీ తక్కువగా ఉందని చికిత్స అందించారు. సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం పుట్టిన పాప కొద్దిసేపటికి మృతి చెందింది. భారతమ్మకు అతిగా రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

    అక్కడ చికిత్స పొందుతూ భారతమ్మ సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు భారతమ్మ మృతదేహాన్ని ఎంసిహెచ్‌కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర కుమార్ బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భారతమ్మకు సరైన వైద్యం అందించామని బీపీ తక్కువగా ఉండటం వల్ల మృతిచెందని చెప్పారు. చివరికి పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లాలంటే గర్భిణీలు ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్సలు చేస్తున్నారని ఆరోపణలు తలెత్తాయి. కాన్పు కోసం వెళ్లాలంటే ఆసుపత్రిలో చికిత్స ఎలా ఉంటుందోని సంకోచిస్తున్నారు.

    మొహర్రం నేపథ్యంలో 14 మంది బైండోవర్:
    మిడ్జిల్ మండలం పరిధిలో మొహర్రం నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులను బైండోవర్ చేశారు పోలీసులు. ఎస్ఐ రాంలాల్ తెలిపిన వివరాలు మేరకు.. మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వాడ్యాల, బోయినిపల్లి గ్రామాలకు చెందిన 14 మంది పై తహసీల్ధార్ సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేశారు. అనంతరం రూ.1 లక్ష పూచీకత్తు పై వారిని విడుదల చేసినట్లు ఎస్ఐ రాంలాల్ తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime, Local News, Nagar kurnool, Telangana

    తదుపరి వార్తలు