హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: కేంద్రానికి మొగులయ్య విజ్ఞప్తి

Nagar Kurnool: కేంద్రానికి మొగులయ్య విజ్ఞప్తి

X
మొగులయ్య

మొగులయ్య వినతి

Telangana: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య చేసినటువంటి కామెంట్స్ గాహాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వంపైన చేసినటువంటి వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య చేసినటువంటి కామెంట్స్ గాహాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వంపైన చేసినటువంటి వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివాసి గిరిజనులను వారి హక్కులను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారికి ఉపాధి అవకాశాలు నిండుగా కల్పించాలని చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పద్మశ్రీ కిన్నెరసాని మొగులయ్య అచ్చంపేట ప్రాంగణంలో ఓఆర్టీసీ బస్సులో వెళుతున్న క్రమంలో ఒక వ్యక్తి నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసి చెంచు గిరిజనులకు ప్రభుత్వ ఉపాధి హామీ పథకాన్ని జర్నలైజ్ చేయడంతో సరైన ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, ఈ విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

దీనికి స్పందించిన మొగులయ్యనాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఏజెన్సీలో నల్లమల అటవీ లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళుతున్నారని పద్మశ్రీ మొగులయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. వారికి స్థానికంగా ఉపాధి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారని, కావున మన ప్రభుత్వం ఆదివాసి గిరిజనులను ఆదుకోవాలని కోరారు.2012 ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసి గిరిజనులకు ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ ఉండేవారు.

తద్వారా వారికి మైదాన ప్రాంతాల్లో సంబంధం లేకుండా కొంత వెసులుబాటు ఉండటం వలన తగిన ఉపాధి దొరికేది. తదంతరం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని జర్నలైజ్ చేయడం ద్వారా చాలామంది ఆదివాసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని భావన కలుగుతుంది.

కావున కేంద్ర ప్రభుత్వం పునరా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే ఆదివాసి గిరిజనుల కోసం ప్రత్యేక ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఉపాధి హామీ పనులు కల్పించారో ఆ విభాగాన్ని పునరుద్ధరించి ఆదివాసి గిరిజనులు వలస వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో మాదిరిగా పాత పద్ధతిలోని ఉపాధి హామీ పనులు కల్పించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఆదివాసి గిరిజనులు ఉపాధి అవకాశాలను కోల్పోవడం ద్వారా చాలామంది అటవీ ప్రాంతాన్ని వదిలి వలసలు వెళుతున్నారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కూలీలుగా మారి అవస్థలు పడుతున్నారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి వారిని కాపాడేందుకు తిరిగి వారిని తమ సొంత స్థలాలకు చేరుకునేలా చేసేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ ప్రత్యేకంగా గిరిజనుల కోసం కల్పిస్తే వారికి అవస్థలు తప్పుతాయని అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు