హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 29,270 మంది ఓటర్లుఉండగా 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విందులు, వినోదాలు తాయిలాలతో ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ ఉండగా బరిలో నిలిచిన వారు టీచర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో అస్త్రాలను సంధించారు.కొన్ని నెలలుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించగా తాజాగా ఆత్మీయ సమావేశాలు, విందు భేటీలతోతైలాలతో విజయమే లక్ష్యంగా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో ప్రత్యేక సంబంధం లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో కలిసి మద్దతుదారుల విజయానికి శ్రమిస్తూ ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది.
హైదరాబాదు, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో 20 మంది స్వతంత్రులుగా కాగా ఒకరు బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీఆర్టియూటీఎస్ తరఫున పోటీ చేస్తున్న కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఈసారి పిఆర్టియు తెలంగాణ మద్దతుతో పోటీలో ఉన్నారు.
పిఆర్టియుటిఎస్ తరఫున గుర్రం చెన్నకేశవరెడ్డి, టీఎస్ యుటిఎఫ్ తరఫున మాణిక్ రెడ్డి, ఎస్టియుటిఎస్ మద్దతుతో భుజంగారావు,బిజెపి తరఫునఏవీఎన్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతుతో హర్షవర్ధన్ రెడ్డి, టిపిటిఎఫ్ మద్దతుతో వినయ్ బాబు, బీసీపీఏ మద్దతుతో విజయకుమార్, టిఎస్పిసిఏ మద్దతుతో సంతోష్ కుమార్, జిటిఏ నుంచి కాసం ప్రభాకర్ తో పాటు 21 మంది పోటీలో ఉన్నారు.
ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2017లో 12 మంది పోటీపడ్డారు. ఇందులో కాటేపల్లి జనార్దన్ రెడ్డి రెండో పర్యాయం గెలుపొందగా మాణిక్ రెడ్డిలు ఏవియన్ రెడ్డిలో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం 21 మంది బరిలో ఉన్నా ప్రధానంగా సి మాణిక్ రెడ్డి, టీఎస్ యుటిఎస్ చెన్నకేశవరెడ్డి, పిఆర్టియుటిఎస్ తాజా మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, టిపిఆర్టియు ఏవీఎన్ రెడ్డిలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మధ్య పోటీ ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది.
ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 29,270 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి , గద్వాల, నారాయణపేట జిల్లాలో అంతా కలిపి 8,190 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
ఈ మేరకు జిల్లాలో 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈనెల 13న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నడంతో 16న సరూర్నగర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 3,461 మంది, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 664 మంది, ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆయా జిల్లా కేంద్రాల్లోని ఓటర్లు అధికంగా ఉండగా ఆయా ప్రాంతాలపైన అభ్యర్థులు ప్రధాన దృష్టి సారించి ప్రచార నిర్వహిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 3,461 మంది ఓటర్లు ఉండగా ఒక మహబూబ్నగర్ అర్బన్ లోనే 2,572 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత జడ్చర్ల మండలంలో 427 మంది ఉన్నారు. వనపర్తి జిల్లాలో 1,335 మంది ఓటర్లు ఉన్నారు. వనపర్తి మండలంతో పాటు గోపాల్పేట, పాన్గల్, రేవల్లి, పెద్దమందండి మండలాల్లో కలిపి వనపర్తిలో రెండు పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ సెంటర్ల పరిధిలో 635 మంది ఓటర్లు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 877 మంది ఓటర్లు ఉండగా ఒక గద్వాల మండలంలోని 42 మంది ఓటర్లు ఉన్నారు. నాగర్ కర్నూల్ 1,853 మంది ఉండగా నాగర్కర్నూల్ పరిధిలోనే 427, అచ్చంపేటలో 329, కల్వకుర్తిలో 311 మంది ఓటర్లు ఉన్నారు. నారాయణపేట జిల్లాలో664 మంది ఉన్నారు. నారాయణపేట దామరగిద్ద ఉట్కూరు మండలాలకు కలిపి పేటలోని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటి పరిధిలో 345 మంది ఓటర్లు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana